ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా.. వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతూ కన్నవారికి కన్నీరు మిగిలిస్తున్నారు.. ముఖ్యంగా యువత ప్రయాణాల్లో నిబంధనలు పాటించడం లేదు.. ద్విచక్ర వాహనాలపై పరిమితికి మించి వెళ్తున్నారు.. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోవడం లేదు.. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి, అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రాకపోవడం బాధాకరం. మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనంపై నలుగురు, మరో వాహనంపై ముగ్గురు హెల్మెట్లు పెట్టుకోకుండా ప్రయాణిస్తూ సాక్షి కంటపడ్డారు.
– గజపతినగరం


