
నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయనగరం అర్బన్: నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని స్థానిక యూత్ హాస్టల్లో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా పెద్దింటి గుణాకరరావు, గౌరవఅధ్యక్షుడిగా చలుమూరు రామారావు, ఉపాధ్యక్షుడిగా పి.మన్మధరావు, ప్రధాన కార్యదర్శిగా ఎల్.నారాయణరావు, సహాయకార్యదర్శిగా గొర్లె శివకుమార్, కోశాధికారిగా ఓఎస్ ప్రకాశరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.గణపతి, కార్యవర్గ సభ్యులుగా కేవీజీఎస్గుప్తా, వై.రవి కుమార్, డి.శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బర్ల మహేష్‌రావు, వై.సూరి, పర్యవేక్షణ అధికారులుగా ఎస్ఎస్రాజు, ఎస్వీరాజు గార్ల సమక్షంలో ఎన్నికలు జరిగాయి. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.