హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా శాన్వి
● విజయనగరంలో ఆంధ్ర జట్టుతో
తలపడనున్న హైదరాబాద్ జట్టు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని రెల్ల గ్రామానికి చెందిన పత్తిక శాన్వి బీసీసీఐ ఉమెన్స్ అండర్–15 వన్ డే ట్రోఫీ 2025–26 హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై ంది. ఆమె సారథ్యంలో హైదరాబాద్ జట్టు విజయనరంలోని విజ్జీ స్టేడియంలో 2026వ జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుతో తలపడనుంది. ఈమేరకు రెల్ల గ్రామానికి చెందిన శాన్వి తండ్రి పత్తిక ప్రవీత్ రంజీ ప్లేయర్ కావడంతో హైదరాబాద్‌లో ఉంటూ..తన కుమార్తె శాన్వి కూడా క్రికెట్‌లో ప్రతిభ చూపేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి పోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న శాన్వి ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్) వేదికగా కోచ్ సాలాం బయాష్ అలియస్ తిలక్ వర్మ ఆధ్వర్యంలో రెండున్నరేళ్లుగా పలు బాలికల క్రికెట్ పోటీల్లో అండర్–15 విభాగంలో దేశ, విదేశాల్లో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పాల్గొని పతిభకనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఉమెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్, సెలక్టర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఆమెను ఎంపిక చేశారు. ఆమె కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోటీల్లో ఉత్తమంగా రాణించాలని ప్రోత్సహించారు.


