ఏఓబీలో విస్తృత దాడులు
● 5400 లీటర్ల పులిసిన బెల్లం,
● 180 లీటర్ల నాటు సారా స్వాధీనం
కురుపాం: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాఽథుడు ఆదేశాల మేరకు ఏఈఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ బి.జీవన్ కిశోర్, విజయనగరం వారి ఆధ్వర్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో సంయుక్త దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్‌శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలైన కెరడ, వలవ గ్రామాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించగా సారా తయారీకోసం నిల్వ ఉంచిన 5400 లీటర్ల బెల్లం ఊట, తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 180 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజయనగరం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్, రాజేశ్వరి, కురుపాం ఎకై ్సజ్‌శాఖ ఎస్సై రాజశేఖర్ , రాజాం, చీపురుపల్లి, పాలకొండ ఎకై ్సజ్‌శాఖ సిబ్బంది పాల్గోన్నట్లు తెలిపారు. సారాపై సరిహద్దుల్లో నిరంతర నిఘా పెడుతున్నామని ప్రజలు కూడా స్పందించి సారా రవాణా, విక్రయాలు చేసేవారి వివరాలను ఈ క్రింది నంబర్ –6302936599కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.


