గోపినాథ్‌జెట్టికి ఎస్పీ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

గోపినాథ్‌జెట్టికి ఎస్పీ శుభాకాంక్షలు

Jan 2 2026 11:27 AM | Updated on Jan 2 2026 11:27 AM

గోపిన

గోపినాథ్‌జెట్టికి ఎస్పీ శుభాకాంక్షలు

గోపినాథ్‌జెట్టికి ఎస్పీ శుభాకాంక్షలు 17న ‘స్వచ్ఛ రథం’ ప్రారంభం బాలక్‌ రామమందిర్‌కు రూ.లక్ష విరాళం రెవెన్యూ సర్వీసెస్‌ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

పార్వతీపురం రూరల్‌: విశాఖపట్నం రేంజ్‌ డీఐజీగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన గోపినాథ్‌ జట్టికి ఎస్పీ ఎస్‌.వి.మా ధవ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం రేంజ్‌ కార్యాలయంలో ఆయనకు పూలమొక్క ను అందజేసి, పదోన్నతితో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

రక్తదానంలో ‘రాముడు’

రాజాం: ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా ఆయన 58 సార్లు రక్తదానం చేశారు. 18వ ఏట ఆరంభించిన రక్తదాన యజ్ఞాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. రక్తదాతగా పేరుపొందారు. ఆయనే రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన శనపతి రాము. అత్యవసరంగా ఓ పాజిటివ్‌ బ్లడ్‌ కావాలని పిలుపు రావడంతో రాజాంలోని జీఎంఆర్‌ కేర్‌ ఆస్పత్రికి గురువారం వెళ్లి రక్తదానం చేసినట్టు రాము తెలిపారు. రక్తదాతను ఆస్పత్రివైద్యులు అభినందించారు.

విజయనగరం అర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాల సమర్ధ నిర్వహణే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ పథకాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈ పథకం వస్తుమార్పిడి (బార్టర్‌) విధానంలో కొనసాగుతుందని వివరించారు. ప్రజలు అందజేసే పొడి చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తారని, దీనివల్ల గ్రామాల్లో చెత్త వేరు చేసే అలవాటు పెంపొందుతుందని తెలిపారు. జిల్లాలోని 27 మండలాలకు ఒక్కో స్వచ్ఛ రథానికి నెలవారీ అద్దె విధానంలో ఆపరేటర్లను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి అద్దె చెల్లిస్తామన్నారు. ఔత్సాహికులు తమ దరఖాస్తులను జిల్లా పంచాయతీ అధికా రి విజయనగరం కార్యాలయానికి ఈ నెల 7వ తేదీలోగా సమర్పించాలని కలెక్టర్‌ కోరారు. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన ఆపరేటర్లను ఎంపిక చేస్తుందన్నారు.

విజయనగరం టౌన్‌: అయోధ్య బాలక్‌ రామమందిర్‌ నమూనాలో నిర్మితమవుతున్న బాలక్‌ రామమందిర్‌కు శ్రీ వాసవీ చారిటీ మిత్రుల గ్రూప్‌, వాసవీక్లబ్‌ సంయుక్తంగా రూ.లక్షా11వేల111లు ఆలయ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావుకు గురువారం విరాళంగా అందజే శారు. కార్యక్రమంలో చారిటీ గ్రూప్‌ అధ్యక్షుడు ఆలవెల్లి శేఖర్‌, వాసవీక్లబ్‌ జిల్లా గవర్నర్‌ తమ్మ న కల్యాణ్‌రాజు, ఆలయ కన్వీనర్‌ పువ్వాడ శ్రీహరి, కార్యదర్శి డిమ్స్‌ రాజు, కోశాధికారి సముద్రాల నాగరాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుంకాల పండు పాల్గొన్నారు.

విజయనగరం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌–2026 డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన రెవెన్యూ విభాగానికి సంబంధించిన కీలకమైన చట్టాలు, సర్కులర్లు, మెమోలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

గోపినాథ్‌జెట్టికి  ఎస్పీ శుభాకాంక్షలు 1
1/1

గోపినాథ్‌జెట్టికి ఎస్పీ శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement