మేం నిద్రపోతాం!
బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మరో యువ ఐఏఎస్ అధికారి,
పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ పాలకొండ మండలంలోని అట్టలి గ్రామం వద్ద
గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను గుర్తించి, సీజ్ చేశారు. ఆ వాహనాలను పోలీసులకు అప్పగించారు. అనంతరం పాలకొండ మండలంలోని అంపిలి, గొట్టమంగళాపురం, చిన్నమంగళాపురం, గోపాలపురం ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇసుక తరలివెళ్తున్న
వాహనాలను ఆపి, వివరాలు తెలుసుకున్నారు.


