కొత్త ఏడాది తీరు మారేనా? | - | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది తీరు మారేనా?

Jan 2 2026 11:27 AM | Updated on Jan 2 2026 11:27 AM

కొత్త ఏడాది తీరు మారేనా?

కొత్త ఏడాది తీరు మారేనా?

ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం

విద్యాసంవత్సరం ముగుస్తున్నా అందని తల్లికి వందనం

గాలికి వదిలేసిన డిజిటల్‌ విద్య

టీచర్లకు ఇచ్చిన హామీల అమలూ అంతే..

లోపభూయిష్టంగా వంద రోజుల ప్రణాళిక అమలు

విజయనగరం అర్బన్‌/రామభద్రపురం:

విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చింది. మరో మూడు నెలల్లో ముగియనుంది. ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో సమస్యలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. విద్యార్థుల ‘సంక్షేమం’ అందని ద్రాక్షగా నే మిగిలింది. ‘తల్లికి వందనం’ అందక విద్యార్థుల తల్లిదండ్రులు వినతులు పట్టుకుని ప్రతి సోమవా రం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు డిజిటల్‌ విద్య అటకెక్కింది. నాణ్యతలేని విద్యాకానుకలతో విద్యార్థులకు తిప్ప లు తప్పడం లేదు. పాఠ్యపుస్తకాలు సైతం పూర్తిస్థాయిలో అందని దుస్థితి. వందరోజుల విద్యాప్రణాళి క అమలులో లోపాలు విద్యార్థులకు శాపంగామారాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో జాప్యం ప్రభావం విద్యాబోధనపై చూపుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యంచేస్తోందని, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులకు ప్రాధాన్యం తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పనులు పూర్తయ్యేనా?

గత ప్రభుత్వం తలపెట్టిన నాడు–నేడు పథకం రెండో విడత నిర్మాణాలకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 737 విద్యాసంస్థల్లో 60 శాతం మేర పనులు పూర్తయిన నిర్మాణాలు ఇప్పుడు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. నాడు–నేడు పనుల పేరు ‘మన బడి మన భవిష్యత్తు’గా పేరు మార్చడ మే తప్ప నిధుల విడుదల, పనుల నిర్వహణ వంటివి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డిజిటల్‌ విద్య గాలికి...

పాఠ్యాంశాల బోధనకు సాంకేతికత జోడించి మరింత నాణ్యతను పెంచేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్‌ విద్య తొలి ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం వేల కోట్ల నిధులతో ఏర్పా టు చేసిన ప్రాథమిక పాఠశాలల స్మార్ట్‌ టీవీలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఐఎఫ్‌పీ (ఇంట్రేక్టివ్‌ ఫ్లాట్‌ పానెల్‌)లు మరమ్మతులకు గురైతే పట్టించుకోకపోవడం వల్ల అవి మూలకు చేరాయి. డిజిటల్‌ విద్యకు దోహదం చేసే 8వ తరగతి విద్యార్ధుల ట్యాబ్‌లు పంపిణీ చేయకుండా వాటి వినియోగాన్ని దూరం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక వ్యవస్థను దూరం చేసి కార్పొరేటు విద్యారంగంపై మమకారం చూపుతోందనే విమర్శలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి.

● టీడీపీ ప్రభుత్వం తొలిఏడాది తల్లికివందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది జిల్లాలో కేవలం 60 శాతం మందికి మాత్రమే పథకం వర్తింప చేసి చేతులు దులుపుకుంది. అర్హులంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement