● కూలిన ఇంటి మట్టి గోడ
రాయగడ: అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 46077 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గుణుపూర్లో అత్యధికంగా 105.7 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సదరు సమితిలో పరిధిలోని కారుబాయి గ్రామానికి చెందిన అజయ్ కరకరియా ఇంటి మట్టి గోడ వర్షాల ధాటికి కూలిపోయింది. బాధిత కుటుంబానికి అధికారులు త్వరలో పాలిథిన్ సీట్లు అందించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో ఇంటిపై భారీ వృక్షం పడటంతో ఇళ్లు దెబ్బతింది. తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే విభాగం ప్రకటించడంతో నిత్యం రద్దీగా ఉండే రాయగడ రైల్వే స్టేషన్ వెలవెలబోయింది.


