● ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: గజపతిజిల్లా గుసాని సమితి ఉప్పలాడ– కుజాసింగి జంక్షన్‌లో గత రాత్రి ఆంధ్రప్రదేశ్ నంబర్ ప్లేటు ఉన్న మ్యాక్స్ పికప్ వ్యాన్‌లో 21 టేకు ముక్కలను ఎటువంటి పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న వారిని దేవగిరి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన టేకు ముక్కలు 36.120 ఘన చదరపు అడుగులు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.రెండు లక్షలు ఉంటుందన్నారు. వాహనం, కలపను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు పోట్నూరు నారాయణరావు (సరియాపల్లి), బండారి మురళీకృష్ణ (గురండి) ను అదుపులోకితీసుకుని వారిని విచారించి కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో అటవీ శాఖ దేవిగిరి రేంజ్ అధికారి అమిత్ సుబ్రజిత్, ఫారెస్టు అధికారి హరికృష్ణ బారిక్, సిబ్బంది పాల్గొన్నారు.


