వర్షాలపై అధికారులు అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

వర్షాలపై అధికారులు అప్రమత్తం

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

● కొనసాగుతున్న సహాయ శిబిరాలు

కొరాపుట్‌: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షం జల్లులు పడుతున్నాయి. బుధవారం కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాలో చెదురు ముదురు వర్షాలు కురిశాయి. అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కొరాపుట్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మందికి పైగా గర్భిణిలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా అందులో 210 మంది మహిళలు సురక్షితంగా ప్రసవించారని కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ సత్యవాన్‌ మహాజన్‌ ప్రకటించారు. తుఫాన్‌ ప్రత్యేక పరిశీలకురాలిగా వచ్చిన అడిషనల్‌ సెక్రటరీ పోమాతుడు కొరాపుట్‌ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తుఫాన్‌ శిబిరాలను పరిశీలించారు. వారికి అందుతున్న ఆహారం, మందులు పరిశీలించారు. బాధితుల యెగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వేకువజాము నుంచి కంట్రోల్‌లో కలెక్టర్‌ సత్యవాన్‌, పోమాతుడులు స్వయంగా కూర్చొని తుఫాన్‌ పరిస్థితి పరిశీలించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కనక వర్దన్‌ సింగ్‌ దేవ్‌ కొరాపుట్‌ జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలసి సమీక్ష చేశారు. అనంతరం పునరావాస శిబిరాలు సందర్శించారు. ఇదే పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్‌ భక్త చరణ్‌ దాస్‌, సీఎల్‌పీ నాయకుడు రాం చంద్ర ఖడం, ఎంపీ సప్తగిరి ఉల్క, ఎంఎల్‌ఎ తారా ప్రసాద్‌ భాహీనీ పతి, పవిత్ర శాంతలతో తుఫాన్‌ పరిస్థితి వివరించారు. ప్రసిద్ధ అంతర్జాతీయ పర్యటక కేంద్రం దేవమాలి పర్వతం పైకి వెళ్లే మార్గంలో కొండచరియలు చొచ్చుకు వచ్చాయి. లక్ష్మీపూర్‌ మార్గంలో కల్వర్టు కుంగిపోవడంతో రాయగడ వైపు వెళ్లే వాహనాలు క్రమబద్ధీకరిస్తున్నారు. మరో వైపు నబరంగ్‌పూర్‌ జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి క్రిష్ట చంద్ర పాత్రో సహాయ పునరావాస శిబిరాలు సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ ముధుస్మిత, ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి మహేశ్వర్‌ స్వయ్‌లు వేర్వేరుగా పునరావాస కేంద్రాల్లో ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరో వైపు అప్పర్‌ ఇంద్రావతి హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌ గేట్లను అధికారులు మూసి వేశారు. గురువారం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరు జిల్లాలా కలెక్టర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నబరంగ్‌పూర్‌ జిల్లా ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి ఆరోగ్య కేంద్రాలు పరిశీలించి గర్భినులకు అందుతున్న సహాయ సహకారాలు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement