తీరం దాటిన అర్నబ్‌ | - | Sakshi
Sakshi News home page

తీరం దాటిన అర్నబ్‌

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

భువనేశ్వర్‌: తీవ్ర తుఫాను అర్నబ్‌ తీరాన్ని దాటే ప్రక్రియ బుధవారం ఉదయం పూర్తయిందని, ఇప్పటివరకు ఒడిశాలో పెద్దగా నష్టం సంభవించలేదని ప్రత్యేక సహాయక కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) రాజేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌ వెల్లడించారు. తుఫాను తీరం దాటినప్పటికీ నెమ్మదిగా కదులుతుండటంతో దక్షిణ ఒడిశా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. తుఫాను బుధవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సుమారు ఆరు గంటల పాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగిందని ఎస్‌ఆర్‌సీ వివరించారు. ఈ సమయంలో తుఫాను ఒకేచోట దాదాపుగా నిలిచిపోయినట్లు కనిపించినప్పటికీ, ప్రస్తుతం అంచనా వేసిన మార్గంలోనే భూభాగంపైకి కదులుతోందని తెలిపారు. బుధవారం సాయంత్రానికి మల్కన్‌గిరి జిల్లాకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలను ఉటంకించారు.

దక్షిణ ఒడిశాలో అతి భారీ వర్షాలు..

తుఫాను ప్రభావంతో బుధవారం దక్షిణ ఒడిశాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రో తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్లకు మించి వర్షం కురిసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దక్షిణ ఒడిశాలో గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేశారు. భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటిమట్టాలు పెరిగి, పట్టణ ప్రాంతాల్లోనూ వరద ముంపు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుఫాను తీరం దాటినప్పటికీ వేగంగా ముందుకు కదలకపోవడంతో దాని ప్రభావం కొనసాగవచ్చని తెలిపారు.

గంజాంలో భారీ వర్షపాతం..

తుఫాను ప్రభావంతో గంజాం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తుండగా, గజపతి జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైనట్లు ఎస్‌ఆర్‌సీ వెల్లడించారు. గత 24 గంటల్లో మోహన మండలంలో 182 మిల్లీ మీటర్లు, పర్లాఖేముండిలో 140 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. సమీక్షా సమావేశం జరిగే సమయానికి మల్కన్‌గిరి, కొరాపుట్‌ జిల్లాల్లో వర్షపాతం నమోదు కాలేదని, రాయగడతోపాటు

తుఫాన్‌ నేపథ్యంలో అధికారుల అప్రమత్తం

రాయగడ: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో రాయగడ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాకు బాధ్యత వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పొరిడ బుధవారం పద్మపూర్‌ సమితిలోని జయపంగ ఆశ్రయ కేంద్రాన్ని సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులకు అందిస్తున్న వండిన ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించడంతోపాటు తిని నాణ్యతను తనిఖీ చేశారు. ఆశ్రయ కేంద్రంలో ఉన్నవారికి పొడి ఆహార పదార్ధాలు, రేషన్‌ సరుకులు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పద్మపూర్‌ సమితిలోని డెరిగాం పంచాయతీ పరిధిలో ఉన్న ముతుకుని గ్రామంలో పక్కా ఇళ్లు లేని కుటుంబాలను ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. గ్రామానికి చెందిన 16 కుటుంబాల్లోని 52 మందిని జయపంగ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆశ్రయ కేంద్రంలో ఉంచారు. వారికి వండిన ఆహారంతో పాటు ఇతర అత్యవసర సదుపాయాలను అధికారులు కల్పిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వార్షాలు, వరద ముప్పును దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.

జలాశయాన్ని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి

సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఉపముఖ్యమంత్రి కేందుగుడ జలాశయాన్ని పరిశీలించి నీటి మట్టం, వరద పరిస్థితిపై అధికారులతో చర్చించారు. మరో వైపు హరభంగి జలాశయం

నుంచి బుధవారం మధ్యాహ్నం నీటిని విడుదల చేసినట్లు సాగునీటి శాఖ అధికారులు తెలిపారు.

ప్రమాదకర హరిభంగి జలాశయం

హరభంగి జలాశయంలో ప్రస్తుతం సెకనుకు 696.312 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయం నీటిమట్టం 386.30 స్థాయికి చేరడంతో ప్రమాద హెచ్చరిక సైరన్‌ మోగించారు. నీటి మట్టం ప్రమాద స్ధాయిని దాటే అవకాశం ఉండటంతో రెండు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం సెకనుకు 203.455 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు సమాచారం. జలాశయం నుంచి విడుదలైన నీరు వంశశధార నదిలో కలుస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. పద్మపూర్‌, రామనగుడ, గుణుపూర్‌ ప్రాంతాల బీడీవోలు, తహసీల్దార్లు స్థానిక అధికారులు హెచ్చరించారు. అవసరమైతే వంశధార నదితీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

6 గంటల్లో 266 మి.మీ. వర్షపాతం

జిల్లా సమాచార, ప్రజాసంబంధాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రాయగడ జిల్లాలో మొత్తం 266 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఉపముఖ్యమంతి పర్యటన సందర్భంగా జిల్లా కలక్టర్‌ అశుతోస్‌ కులకర్ణి, జిల్లా ఎస్పీ రాజ్‌ ప్రసాద్‌తోపాటు ఇతర అధికారులు తుఫాన్‌ సహాయక చర్యలు, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

మరికొన్ని జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదని వివరించారు.

2,000 మంది గర్భిణుల తరలింపు..

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2,000 మందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎస్‌ఆర్‌సీ తెలిపారు. జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం,

ఒడిశాలో పెద్దగా నష్టం లేదు:

ఎస్‌ఆర్‌సీ

దక్షిణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం: ఐఎండీ

సహాయక శిబిరంలో ఆహార నాణ్యత పరిశీలించిన డిప్యూటీ సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement