జాతీయ జట్టుకు ఒడిశా క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ జట్టుకు ఒడిశా క్రీడాకారుల ఎంపిక

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

● బిసంకటక్‌లో ముగిసిన

సెపక్‌తక్రా శిక్షణ

రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో 17 రోజులపాటు నిర్వహించిన సెపక్‌తక్రా శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. ఈ శిబిరంలో ప్రతిభ కనబరిచిన 8 మంది మహిళలు, 8 మంది పురుష క్రీడాకారులు జాతీయ సీనియర్‌ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో ఒడిశా రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఈ నెల 7వ తేదీన బిసంకటక్‌ సమితి విద్యాశాఖ కార్యాలయం సమీపంలో ప్రారంభమైన ఈ శిక్షన శిబిరంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది మహిళా, పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర సెపక్‌తక్రా కోచ్‌ లక్ష్మీప్రియ నాయక్‌ పర్యవేక్షణలో క్రీడాకారులు శిక్షణ పొందారు.

జాతీయ పోటీలకు 16 మంది ఎంపిక..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనున్న జాతీయ సీనియర్‌ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 8 మంది క్రీడాకారులతోపాటు ఇద్దరు కోచ్‌లు,

ఇద్దరు మేనేజర్లు ఎంపికయ్యారు. ఎంపికై న బృందం గురువారం గ్వాలియర్‌కు బయలుదేరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి బిసంకటక్‌ తహసీల్దార్‌ కె.వెంకటేశ్వర రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హటొమునిగుడ ప్రభుత్వ ఉన్న పాఠశాల హెచ్‌ఎం అవనానంద నాయక్‌, బిసంకటక్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం హేమంత్‌ కుమార్‌ దీప్‌, బీజేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ మహంతి, ఒడిశా సెపక్‌తక్రా ఉపాధ్యాక్షుడు విశ్వనాధ్‌ మిశ్రా, అంతర్జాతీయ సీనియర్‌ కొచ్‌ లలాటేందుకు స్వామిన్‌, రాయగడ జిల్లా సెపక్‌తక్రా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ పండా తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో శిబిరం నిర్వహణ..

ఒడిశా రాష్ట సెపక్‌తక్రా సంఘం ప్రధాన కార్యదర్శి పృథ్వీ రాజ్‌ సాహు సమర్థవంతమైన నిర్వహణ, ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణ శిబిరం ప్రశాంతంగా, క్రమశిక్షణతో ముగిసింది. శివరామ్‌ నాయక్‌ వేదిక నిర్వహణ చేయగా, శశిభూషన్‌ పట్నాయక్‌, సమర్‌ కుమార్‌ సాహు, మనోజ్‌ ప్రధాన్‌ తదితరులు సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement