నవంబర్‌ 18 నుంచి శీతాకాల సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 18 నుంచి శీతాకాల సమావేశాలు

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

భువనేశ్వర్‌: ఒడిశా అసెంబ్లీకి చెందిన ఎనిమిదో శీతాకాల సమావేశాలు నవంబర్‌ 18న ప్రారంభమై డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతాయి. 33 పనిదినాలతో కలిపి 44 రోజుల పాటు కొనసాగుతుంది. తాత్కాలిక క్యాలెండర్‌ ప్రకారం 2026–27 సంవత్సరానికి సంబంధించిన మొదటి అనుబంధ వ్యయ నివేదికను నవంబర్‌ 18న సమర్పించనున్నారు. మొదటి అనుబంధ ప్రకటనకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లపై నవంబర్‌ 25, 26, 27 తేదీలలో సభలో చర్చిస్తారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన మొదటి అనుబంధ వ్యయ నివేదికపై కేటాయింపుల బిల్లును నవంబర్‌ 30న ప్రవేశపెడతారు.

17 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం

● ఇద్దరిపై కేసు నమోదు

రాయగడ: పట్టణంలోని భీమా వీధి ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి 17 ఖాళీ గ్యాస్‌ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. చోరీ కేసులో ఇద్దరు వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గరుగుబల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలొని కొటనాన రామినాయుడు, వలస గ్రామానికి చెందిన పి.గణేష్‌ పట్టణంలోని భీమా వీధికి చెందిన రామమూర్తి బెహర కుమారుడు ప్రసాద్‌ బెహర నిందితులుగా ఉన్నారు. పి.గణేష్‌ రాయగడలోని కండ్రవీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపారు. ప్రసాద్‌ బెహర ఇంటి నుంచి 17 ఖాళీ గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సుశాంత్‌ కుమార్‌ పట్నాయక్‌ వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులను కోర్టుకు తరలించామన్నారు.

చమేలీ ఓఝాపై

అవిశ్వాస తీర్మానం రద్దు

భువనేశ్వర్‌: గ్రామ పంచాయతీ సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రక్రియలో తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో, కేంద్రాపడా జిల్లా టిఖిరి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ చమేలీ ఓఝాపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఒడిశా హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. పంచాయతీలో 22 మంది వార్డు సభ్యులు ఉండగా, వారిలో 21 మంది చమేలీ ఓఝాపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. ఈ ప్రక్రియను జూలై 27న ప్రారంభించి, సెప్టెంబర్‌ 13న ఓటింగ్‌ నిర్వహించేందుకు తేదీని ఖరారు చేశారు. అయితే, అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో చట్టం నిర్దేశించిన తప్పనిసరి విధానాలను పాటించలేదనే అంశం న్యాయస్థానం విచారణకు వచ్చింది. ఒడిశా గ్రామ పంచాయతీ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం, సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం చేపట్టే ముందు నిర్దేశిత నోటీసు వ్యవధిని పాటించడంతోపాటు, తీర్మానానికి సంబంధించిన అభ్యర్థన పత్రాలు, ఇతర అవసరమైన పత్రాల ప్రతులను సంబంధిత సర్పంచ్‌కు అందించాలి. ఈ నిబంధనల ఉద్దేశం అవిశ్వాస తీర్మాన ప్రక్రియపై పూర్తి సమాచారం అందించి, సంబంధిత వ్యక్తికి తన అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని కల్పించాలి. అయితే, చమేలీ ఓఝాకు తీర్మానం, అభ్యర్థన పత్రాల ప్రతులు అందించలేదని, నోటీసు ప్రతిని ఆమె తండ్రికి అందజేయడంతోపాటు మరో ప్రతిని తపాలా ద్వారా పంపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, చట్టం నిర్దేశించిన విధానాన్ని అనుసరించకుండా అవిశ్వాస తీర్మాన ప్రక్రియను కొనసాగించడం చట్టబద్ధతకు విరుద్ధమనే అంశం విచారణలో ప్రాధాన్యం సంతరించుకుంది. జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ జరిపి, అవిశ్వాస తీర్మానాన్ని చెల్లదని ప్రకటించింది. దీంతో సర్పంచ్‌పై చేపట్టిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియకు న్యాయపరమైన చెల్లుబాటు లేదని స్పష్టమైంది. ఈ తీర్పు గ్రామ పంచాయతీల్లో ఎన్నికై న ప్రజాప్రతినిధులపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే సందర్భంలో చట్టం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. సభ్యుల సంఖ్యాబలం ఎంత ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియను విస్మరించి తీసుకునే నిర్ణయాలు న్యాయపరీక్షకు నిలవదనే అంశాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement