ఏకతానగర్‌కు 160 మంది పయనం | - | Sakshi
Sakshi News home page

ఏకతానగర్‌కు 160 మంది పయనం

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

రాయగడ: గుజరాత్‌లోని ఏకతానగర్‌లో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాయగడ రైల్వే స్టేషన్‌ నుంచి 160 మంది ప్రతినిధులు ప్రత్యేక రైలులో బయలుదేరారు. ఉపముఖ్యమంత్రి ప్రభాతి పొరిడ మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపి ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులకు ఉత్తరీయాలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాయగడ, కొరాపుట్‌, మల్కనగిరి జిల్లాల నుంచి 50 మంది చొప్పున మొత్తం 150 మంది ప్రతినిధులు, మరో పది మంది నోడల్‌ అధికారులు పాల్గొంటున్నారు. వీరంతా ప్రత్యేక రైలులో ఏకతానగర్‌కు పయనమయ్యారు. రాష్ట్రం నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఏకతా నగర్‌కు వెళ్తున్నారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురష్కరించుకుని నిర్వహించే ఈ ఉత్సవాలు జాతీయ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్‌ అశుతోస్‌ కులకర్ణి, ఎస్‌డీసీ అధ్యక్షుడు విద్యాధర్‌ సబర్‌, ఎస్‌డీసీ ఉపాధ్యక్షురాలు మంజుల మినియాక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement