అవినీతిపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

అవినీతిపై ఉక్కుపాదం

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

భువనేశ్వర్‌: ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్తూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు. అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి అవినీతి వ్యతిరేక అవగాహన వారోత్సవాలు–2026 సందర్భంగా లోక్‌ సేవా భవన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు కీలకమని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అవినీతి సమస్యలను నేరుగా మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తున్నారని, వాటిపై తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరాలి..

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్‌ మాట్లాడుతూ, ప్రజల కష్టార్జితంతో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలు చివరి వరుసలో ఉన్న లబ్ధిదారులకు చేరాలంటే ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పనిచేయడం అత్యవసరమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల వినియోగంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో పారదర్శకంగా సేవలు అందిస్తోందని తెలిపారు. విజిలెన్‌స డైరెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌ జెట్వా తమ శాఖ సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్‌ అధికారులు, విశ్రాంత అధికారులు పాల్గొన్నారు.

అవినీతిపై మూడంచెల వ్యూహం..

అవినీతిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మూడు ప్రధాన వ్యూహాలను అనుసరిస్తోందని ముఖ్య మంత్రి వివరించారు. శూన్య, సహన విధానం, నిఘా సమాచారం ఆధారంగా హోదా లేదా పద వీకాలంతో సంబంధం లేకుండా చట్టపరమైన చర్యలు, అవినీతికి పాల్పడి అరెస్టయిన అధికారులకు చట్టప్రకారం శిక్షలు పడేలా చూడటమని పేర్కొన్నారు. ఈ వ్యూహాలను ఒడిశా విజిలెన్స్‌ శాఖ నిష్పక్షపాతంగా, వృత్తిపరమైన నిబద్ధతతో అమలు చేస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు.

నిజాయితీకి పెద్దపీట

అవగాహన వారోత్సవాల్లో సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ

నిజాయితీ, నిబద్ధతపై అధికారులతో ప్రమాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement