పర్లాకిమిడి: అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి సంధర్భంగా శనివారం జిల్లా స్థాయి క్రీడా ఉత్సవాలు పర్లాకిమిడి గజపతి స్టేడియంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ అనుప్ పండా, అతిథిగా పురపాలక సంఘచైర్మన్ నిర్మలా శెఠి, సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనామంగరాజ్, విశ్రాంత క్రీడాధికారి త్రినాథసాహు అంతర్జాతీయ ఆటగాడు కిశోర్ చంద్ర రథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా విచ్చేసిన క్రీడాకారులకు అనేక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, కబడ్డీ, బాలికలకు మ్యూజికల్ చైర్, హాకీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. విజేతలకు సబ్‌కలెక్టర్ అనుప్ పండా ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రెండు రోజులుగా ఈ క్రీడోత్సవాలు జరిగాయి.


