మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమి తి రోడన్‌పల్లి గ్రామానికి చెందిన యువతి బుధవారం మృతి చెందింది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పింకీ భోజ నం చేసి నిద్రపోయింది. మంగళవారం ఉద యం నిద్ర లేచి కాలు తీవ్రంగా నొప్పి పెడుతుందని తల్లికి తెలిపింది. పాము కాటు కనిపిచడంతో పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. బుధవారం ఉదయం పింకీ మృతి చెందింది. ఈ విషయంపై పోడియా ఐఐసీ దేవేంద్ర భత్రా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంత రం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు.
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో గీతాంజలి పబ్లిక్ స్కూల్‌లో పోలీసులు సైబర్ సెక్యూరిటీ, నిషా ముక్త అభియాన్‌పై విద్యార్థుల్లో బుధవా రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డి.వేణుగోపాలరావు, ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.
జయపురం: జయపురం సబ్ డివిజన్‌లోని కుంధ్ర సమితి రాణిగుడ గ్రామ పంచాయతీ ఉన్న త మాద్యమిక పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ పాఠశాల ప్రధాన గేటుకు తాళాలు వేశారు. టెన్త్ వరకు 356 మంది విద్యార్థులు చదువుతున్నారని, గతంలో 11 మంది ఉపాధ్యాయులు ఉండేవారని, వారిలో ముగ్గురిని ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించ డం తగదన్నారు. అనంతరం బ్లాక్ విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.
మందస: మండలంలోని టబ్బగాం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ కానిస్టేబుల్ సవర శేషగిరి (28) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలో ని ఖుర్దా యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న శేషగిరి ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చా డు. గ్రామ సమీపంలోని జీడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో పని ఒత్తిడితో కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం పీహెచ్‌సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అరసవల్లి: జిల్లా విద్యుత్ సర్కిల్‌లో పీఎం సూర్యఘర్ పథకం అమలు లక్ష్యాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టివి.సూర్యప్రకాష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ ఎస్టీ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు కచ్చితంగా సోలార్ రూఫ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీ వినియోగదారులు 16278 మంది ఉండగా, ఇంతవరకు 9032 ఇళ్లకు మా త్రమే సోలార్ పథకాన్ని అమర్చారని, మిగిలిన వారికి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ప్రధాన దేవాలయంలో ఇంద్ర లింగానికి బుధవారం సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించారు. ‘శివ..శివా’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి దేవదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు స్పందించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పవిత్ర వంశధార నదీ జలాలతో శుద్ధి చేసి భక్తులకు దర్శనాలు కలిగించారు. ఇదిలా ఉండగా ‘సాక్షి’లో వచ్చిన కథనానికి దేవదాయ శాఖ అధికారులు స్థానిక ఈఓ ఏడుకొండలను మందలించినట్లు సమాచారం. దీనిపై ఈఓ, అర్చకులు వాగ్వాదానికి దిగారు. జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు చొరవ తీసుకొని ఆలయ నిర్వహణ సమష్టిగా చూడాలని సర్దిచెప్పడంతో వివాదం సద్దు మణిగింది.
శ్రీకాకుళం క్రైమ్ : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 27 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి అక్టోబరు 1 నుంచి ట్రైనింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత వీరికి ప్రమోషన్ కల్పించాల్సి ఉన్నా 27 హెచ్‌సీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ జరిపినట్లు పోలీసు వర్గాల సమాచారం.


