మల్కన్‌గిరి: మత్తిలి సమితి పరిధిలోని కిర్మిట్ల సమీప అడవిలో డీవీఫ్ జవాన్లు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. గురువారం ఉదయం తిరిగి వస్తున్న సమయంలో మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 3 తుపాకీలు, 6 ఐఈడీలు, క్లెమెరో మైన్లు, కరెంటు వైర్లు ఉన్నాయి. ఇందులో వీటిని ఎస్పీ వినోద్ పటేల్ ఎదుట ప్రదర్శించారు.
నిపుణులైన డాక్టర్లను నియమించాలి
జయపురం: స్థానిక పూల్‌బెడ గ్రామ ప్రాంతంలోని జిల్లాకేంద్ర ఆస్పత్రిలో నిపుణులైన డాక్టర్లను నియమించాలని జయపురం సచేతన నాగరిక కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సచేతన నాగరిక కమిటీ సభ్యులు అభిమన్య భొటమిశ్ర, తుషార్ మిశ్ర, సనాతన పురోహిత్, సంజీవ కుమార్ సాహు, సుధామ్ మహరాణ తదితరులు జిల్లా ప్రధాన వైద్యాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన వ్యాధుల విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందన్నారు.


