రోడ్డు నిర్మాణం చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణం చేపట్టాలి

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

కర్తాన్‌పల్లి పంచాయతీ ప్రజల విజ్ఞప్తి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి కర్తాన్‌పల్లి పంచాయతీ దుతిబేడ గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామం నుంచి కియాంగ్‌, సలీమ్‌ పంచాయలు దాటి కర్తన్‌పల్లి పంచాయతీ రావాలంటే నరకాన్ని చైస్తున్నారు. సుమారు 12 కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా శిథిలమైంది. దీంతో చినుకుపడితే చిత్తడిగా మారి నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. వర్షం కురిస్తే రాకపోకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ పరిస్థితి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుతూ సమితి అధ్యక్షురాలు లక్ష్మీప్రియా నాయక్‌ పలుమార్లు జిల్లా పరిపాలన కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. అయిన్పటికీ ఎలాంటి స్పందన లేదు. పింఛన్లు, రేషన్‌ సరుకులు తీసుకోవడానికి వెళ్లేందుకు కూడా ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని కూడా లక్ష్మీప్రియా నాయక్‌ అధికారులకు విన్నవించి ఉన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డును ఆమె గురువారం మారోసారి పరిశీలించారు. రోడ్డు దుస్థితిపై మరోసారి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని గ్రామస్తులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement