● స్వర్గ రథం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

● స్వర్గ రథం ప్రారంభం

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొరిగుమ్మలో ఉచితంగా మృతదేహాలను తరలించడం కోసం సమాజ సేవకుడు, న్యాయవాది మున్న దొర సొంత నిధులతో స్వర్గ రథాన్ని సమకూర్చారు. దీన్ని కొరాపుట్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నరేష్‌ చంద్రశబర శుక్రవారం ప్రారంభించారు. బొరిగుమ్మ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ఉపయోగంగా ఉంటుందన్నారు. దాత మున్న దొరను అభినందించారు. ప్రజల సామాజిక అవసరాలు తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బొరిగుమ్మ సూర్యభాను గ్రంథాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బొరిగుమ్మ సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి (ఎస్‌డీపీవో) సత్యబ్రత లెంక, బొరిగుమ్మ అదనపు తహసీల్దార్‌ బోయిన సతీష్‌, విశ్రాంత ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ రథ్‌, మునా దొర తండ్రి, రిటైర్డ్‌ పోలీసు అధికారి బిజయ కుమార్‌ దొర, సూర్యభాను గ్రంథాలయ పరిశీలన కమిటీ అధ్యక్షులు బిజయనారాయణ సాహు, బొరిగుమ్మ న్యాయవాదుల సంఘ అధ్యక్షులు నాగరాజు దొర, సూర్య ఆచారి, న్యాయవాదులు అశోక్‌ గంతాయిత్‌, ప్రసాద్‌ బాడిక, బిష్ణు షొడంగి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement