ఎదురెదురుగా కార్లు ఢీ.. నలుగురు మృతి | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా కార్లు ఢీ.. నలుగురు మృతి

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

కొరాపుట్‌: ఎదురెదురుగా కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మంగళవారం రాత్రి నబరంగ్‌ఫూర్‌ జిల్లా ఉమ్మర్‌కోట్‌ పట్టణం సమీపం బడకుమరి గ్రామ సమీపంలో భారత మాల 6 అంచెల జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. కొరాపుట్‌ జిల్లా సునాబెడాకి చెందిన అరుణ్‌ కుమార్‌ పండా (65), అతని మనుమడు అశుతోష్‌ రధ్‌ (10), మేనల్లుడు సుభ్రత్‌ సత్పతి (35) లు సంఘటన స్థలంలో మృతి చెందారు. వీరు నబరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితిలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నబరంగ్‌పూర్‌ జిల్లా జోరిగాంలో మరో శుభ కార్యానికి వెళ్తున్న కారు వీరి కారుని ఢీకొట్టింది. ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బంశీధర్‌ పండా (40) మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement