
వారాహిమాతకు విశేష పూజలు
రాయగడ: శ్రావణమాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని రాయగడలోని బ్రాహ్మణవీధి కోదండరామ మందిరంలో వారాహి మాత పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మందిరం ప్రధాన అర్చకులు అనంత ఆచార్యుల ఆధ్వర్యంలో విశేషపూజలు జరిగాయి. ఈ సందర్భంగా సామాహిక కుంకుమ పూజలను నిర్వహించారు. అధికసంఖ్యలో మహిళలు పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
11,111 బంగారు
పుష్పాలతో పూజలు
కొరాపుట్: లలితా త్రిపుర సుందరి అమ్మవారికి 11,111 బంగారు పుష్పాలతో విశేష అర్చన జరిగింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కేంద్రంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో శ్రావణ మాస శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా బంగారు పుష్పాలతో పాటు మరో 11,111 కలువ పువ్వులతో అమ్మవారికి అర్చన చేశారు.
కరాటేలో శ్రేయాస్‌కు
కాంస్య పతకం
రాయగడ: ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయిపూర్‌లోని తెలిబంధ అగ్రశేణ్ మండపంలో జరిగిన 32వ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్–2025 పోటీల్లో రాయగడకు చెందిన శ్రేయాస్ చౌదరికి కాంస్య పతకం లభించింది. ఈ పోటీల్లో ఒడిశా రాష్ట్రం నుంచి నలుగురు యువకులు పాల్గొనగా సబ్ జూనియర్ విభాగంలో శ్రేయాస్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. దీంతో అతడిని ఒడిశా కరాటే అసోసియేషన్‌కు చెందిన కార్యదర్శి షేక్ సాజు, అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రావు తదితరులు అభినందించారు.
అమరులకు నివాళులు
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితిలో మత్తిలి మారణకాండ దినోత్సవాన్ని గిరిజన సంఘాలు గురువారం నిర్వహించారు. 1942 ఆగస్టు 21వ తేదీన సాహిద్ లక్ష్మణ్ నాయక్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో 12 మంది స్వాతంత్య్ర సమరయోధులు మృతి చెందారు. ఈ ఘటనకు 83 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్క మి, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, చిత్ర కొండ మాజీ ఎమ్మెల్యేలు పూర్ణచంద్ర బక్క, డొంబురు సీసా, మత్తిలి బీజేడీ నాయకురాలు లక్ష్మిప్రియ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ట్రక్కు ఢీకొని దంపతులు మృతి
భువనేశ్వర్: ట్రక్కు ఢీకొన్న ఘటనలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. కటక్ ప్రాంతం గోపాల్‌పూర్‌లో బైక్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను భువనేశ్వర్‌కు చెందిన దంపతులుగా గుర్తించారు. దుర్ఘటనకు పాల్పడిన ట్రక్కును కటక్ సదరు ఠాణా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వారాహిమాతకు విశేష పూజలు

వారాహిమాతకు విశేష పూజలు

వారాహిమాతకు విశేష పూజలు

వారాహిమాతకు విశేష పూజలు