
ఆది కర్మ యోగి అభియాన్ ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆది కర్మ యోగి అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ మధుమిత శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో ఆకాంక్ష బ్లాక్ కేంద్రాలు గుమ్మా, ఆర్.ఉదయగిరితో పాటు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆది కర్మయోగి అభియాన్ కింద ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, తాగునీరు వనరులు, వ్యవసాయం, ఉపాధి వికేంద్రీకరణ అభివృద్ధికి కృషి చేస్తామని ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో అన్నారు. జిల్లాలో 7 మండలాల్లోని 108 గ్రామ పంచాయతీల్లో ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫాల్గునీ మఝి, జిల్లా ముఖ్య వైద్యాధికారి డా.మహ్మద్ ముబారక్ ఆలీ, మిషన్ శక్తి డైరక్టర్ టిమోన్ బోరా, సీసీడీ సంస్థ కార్యదర్శి ఎ.జగన్నాత రాజు తదతరులు పాల్గొన్నారు.