
రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్రగాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి బిజాఘాట్టిలో శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వస్తున్న ఇద్దరు పోలీసులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న వీడియో జర్నలిస్టు జానికి పట్నాయక్, చక్రధర్ పట్నాయక్, సమాజ్ సేవకుడు నగేశ్వర్ పట్నాయైక్ బోరాజా గ్రామానికి వెళ్లి వస్తుంగా.. రక్తపు మడుగులో పడివున్న వ్యక్తిని చూసి మానవత్వంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి మత్తిలి సమితికి చెందిన పోలీసు ఉద్యోగి రజాన్ కుమార్‌గా గుర్తించారు. మరొకరికి స్వల్పగాయాలు అయ్యాయి. రజాన్ తల, చేతికి తీవ్రంగా గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.