
ఘనంగా పండిత గోపినాథ నోందో శర్మ జయంతి
పర్లాకిమిడి: స్థానిక ఒడియా మంగలివీధిలో ఉత్కళ హితేషినీ సమాజ్ హాలులో శుక్రవారం సాయంత్రం పండిత గోపినాథ నోందో శర్మ జయంతి ఉత్సవాన్ని ఉత్కళ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో జరుపుకున్నారు. ఉత్సవాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు కులమణి ఓఝా విచ్చేసి పండిత గోపినాథ నోందో చిత్రపటానికి జ్యోతిని వెలిగించి ప్రారంభించగా, గౌరవ అతిథులుగా పూర్ణచంద్ర మహాపాత్రో, బినోదిని సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులమణి ఓఝా మాట్లాడుతూ.. పండిత గోపినాథ నోందో శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో పుట్టి పర్లాకిమిడిలో పెరిగి విద్యాభ్యాసం చేశారని, ఆయన ఒడియా, తెలుగు భాషలో 1907లో సీతావన వాసం, 1910లో జానకీ పరిణయం, ఒడియా భాషా తత్వ బోధినీ అవధానం, శబ్దతత్వ బోధినీ, శ్రీభారత్ దర్పణ్ వంటి ఎనిమిది పుస్తకాలు రచించారని అన్నారు. ఆయన రచించిన ఉభయరత్నమాల ఇంతవరకూ ప్రచురణకు నోచుకోలేదన్నారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ కులమణి ఓఝాను ఉత్కళ హితేషిణీ కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో ఓఎస్‌వో అసిస్టెంట్ సెక్రటరీ సంజయ్ కుమార్ స్వాలసింగి, బరంపురం విశ్వవిద్యాలయం (హెచ్‌వోడీ) సదానంద నాయక్, బిచిత్రానంద బెబర్తా పాల్గొన్నారు.
అంధకారంలో
జిల్లా కేంద్రాస్పత్రి
రాయగడ: మోబైల్ టార్చ్ లైట్ల సహాయంతో సుమారు మూడు గంటల పాటు వైద్య సేవలు కొనసాగాయి. ఇదేదో మారుమూల పీహెచ్‌సీ, సీహెచ్‌సీ కేంద్రాల్లో చోటు చేసుకుందంటే తప్పులో కాలేసినట్టే. సాక్షాత్తు జిల్లా కేంద్రాస్పత్రిలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. టీపీఎస్‌డీవోఎల్ ( విద్యుత్ శాఖ) సంస్థ విద్యుత్ మరమ్మతు పనులకు సంబంధించి శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ముందస్తుగానే ప్రకటించింది. అయితే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వారి నిర్లక్ష్యం కారణంగా రోగులు నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ కొత కారణంగా సరఫరా నిలిచిపొవడంతో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులు పాలయ్యారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే అత్యవసర పరిస్థితిలొ ఉండే జనరేటర్ మోరాయించడంతొ సమస్య మరింత జటిలమయ్యింది . హస్పటల్ కు చికిత్స కొసం వచ్చే రొగుల రక్తనమూనాలు సేకరించే వార్డులొ, అదేవిధంగా అవుట్‌డొర్ పెసేంట్ల వార్డుల్లొ విద్యుత్ లేకపొవడంతొ అంధకారంగా మారింది. దీంతొ రొగుల మోబైల్ టార్చ్‌లైట్ల సహయంతొ వైద్యులు వారికి పరీక్షలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు గంటల పాటుగా ఇదే తంతు కొనసాగింది. అనంతరం జన రేటర్‌ను బాగు చేయడంతొ పరిస్థితి మెరుగుపడింది.

ఘనంగా పండిత గోపినాథ నోందో శర్మ జయంతి