రాయగడ: సదరు సమితి అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్‌షిప్‌లో కొలువైయున్న శ్రీలక్ష్మీనృసింహునికి సాలగ్రామ హారంతో అలంకరించారు. ప్రముఖ వేద పండితులు, స్థానిక బాలాజీనగర్‌లో గల కళ్యాణవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల దంపతులు అత్యంత పవిత్రమైన 69 సాలగ్రామాలతొ రూపొందించిన హారాన్ని స్వామివారికి బహుకరించారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయం అర్చకులు మంగనాథ ఆచార్యుల పర్యవేక్షణలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం ప్రత్యేక పూజలను నిర్వహించి ఈ హారాన్ని స్వామి వారి మెడలొ అలంకరించారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాలగ్రామా హారం బహుకరించిన భాస్కరాచార్యులకు ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు.
500 ఎకరాలలో
పామాయిల్ సాగు
జయపురం: జయపురం సబ్‌డివిజన్‌లో 500 ఎకరాలలో పామాయిల్ తోటలు పెంచేందుకు నిర్ణయించినట్లు ఉద్యోగ వ్యవసాయ విభాగ ప్రభుత్వ డైరెక్టర్ సంజీవ కుమార్ మహంతి వెల్లడించారు. మొదటి సారి జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి బాగ్ధెరి పంచాయతీ కుర్పకేట్‌లో పామాయిల్ తోటలు పెంచే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. పామాయిల్ తోటలు పెంచేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. అలాగే బ్యాంక్ సహాయం అందే సౌకర్యం కల్పిస్తామని మహంతి వెల్లడించారు. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికతో పాటు భూములను గుర్తించటం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన జాతీయ వంటనూనె (ఎడిబుల్ ఆయిల్)మిషన్–పామ్‌ఆయిల్ పథకంలో జయపురం సబ్‌డివిజన్‌లోని జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ, కొట్‌పాడ్, కుంధ్ర సమితిలలో 500 ఎకరాలలో పామాయిల్ తోటలు పెంచుతామన్నారు. స్థానిక బలిపెట వీధిలోని రైతు సుధాంశు శేఖర పాత్రోకు కుంధ్ర సమితి బాగ్దెరి పంచాయతీలో గల 4.8 హెక్టార్లలో పామ్ ఆయిల్ మొక్కలు నాటామన్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే 2029 నాటికి పంట ఉత్పత్తి ప్రారంభమౌతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా సమితిలలో రైతులు పామాయిల్ మొక్కలు వేయాలని ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏహెచ్‌ఓ సునీల్ కుమార్ సాహు ఉన్నారు.
మెగాస్టార్ జన్మదిన వేడుకలు
పర్లాకిమిడి: స్థానిక జంగంవీధి వద్ద ఆర్.ఆర్.కళ్యాణ మండపంలో శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఆయన అభిమాన సంఘం ఘనంగా జరుపుకున్నారు. చిరంజీవి ఫ్యాన్సు అలిజింగి రాము, శివ, శ్యాం తదితరులు కేక్ కట్‌చేసి అభిమానులు సందడి చేసుకున్నారు.
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్వాకం విస్తుగొలుపుతోంది. రోగులకు ఇంజెక్షన్ ఇవ్వా ల్సి వచ్చినప్పుడు పురుషులకు, మహిళలను ప్రత్యేక గదుల్లో ఉంచి బెంచీ మీద కూర్చోబెట్టి, లేదంటే మంచం మీద పడుకోబెట్టి ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది. ఈ ఆస్పత్రిలో పురుషులు, మహిళలకు ఒకేచోట ఇంజెక్షన్ వేస్తున్నారు. ఆరుబయట చేస్తుండడంపై మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి పురుషులకు, మహిళలకు వేర్వేరుగా గదులు ఏర్పాటు చేసి ఇంజెక్షన్లు వేయించాలని పలువురు కోరుతున్నారు.
లక్ష్మీనృసింహునికి సాలగ్రామ హారం
లక్ష్మీనృసింహునికి సాలగ్రామ హారం