
పూర్వ విద్యార్థులు విజ్ఞాన వారధులు: గవర్నర్
● అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య
భువనేశ్వర్: విద్య వ్యక్తిగత విజయ సంకేతానికి పరిమితం కాదని, జ్ఞానోదయ సమాజ ఆవిష్కరణతో సమయానుకూల మగనుగడకు బలమైన వారధిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి స్థానిక ఉత్కళ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. వాణీ విహార్ ఉత్కళ విశ్వ విద్యాలయం క్యాంపస్‌లో ఎంకేసీజీ ఆడిటోరియంలో ఉత్కళ విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం 5వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఎనిమిది దశాబ్దాల పైబడి ఘన చరిత్ర కలిగిన ఉత్కళ విశ్వ విద్యాలయం రాజకీయాలు, పాలన, సైన్‌న్స్, విద్య, సాహిత్యం, చట్టం, సంస్కృతి, వ్యాపారం, ప్రజా జీవితంలో బహుముఖ ప్రజ్ఞాశాలుల్ని తీర్చిదిద్దిందని తెలిపారు. విద్యా నైపుణ్యత విలువల్ని గుర్తించే దిశలో యువ విద్యార్థులకు మార్గదర్శకత్వం, గ్రీన్ అండ్ క్లీన్ క్యాంపస్ ఉద్యమం వంటి చొరవలకు పూర్వ విద్యార్థులు ప్రోత్సహించడం హర్షణీయమన్నారు. విశ్వ విద్యాలయ జీవితం స్వీయ–ఆవిష్కరణ, విలువల రూపకల్పనతో జీవిత లక్ష్యం దశ దిశ నిర్ధారించే అత్యద్భుత ఘట్టమని చెప్పారు. కార్యక్రమానికి ప్రముఖ వక్తగా హాజరయ్యారు. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జగ్నేశ్వర్ దండపట్ గౌరవ అతిథిగా, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సత్యజిత్ మహంతి, ప్రధాన కార్యదర్శి దేబేంద్ర ప్రసాద్ దాస్ వందలాది మంది పూర్వ విద్యార్థులు హాజరై సమావేశంలో ప్రసంగించారు.

పూర్వ విద్యార్థులు విజ్ఞాన వారధులు: గవర్నర్

పూర్వ విద్యార్థులు విజ్ఞాన వారధులు: గవర్నర్