
మహేంద్రగిరి బహుముఖ ఆగ్రో సంస్థపై గిరిజనుల ఆరోపణ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గుమ్మా, కాశీనగర్ సమితిల్లో అనేక మంది ఆదివాసీ ప్రజల వద్ద నుంచి మహేంద్రగిరి బహుముఖ ఆగ్రో ప్రోడక్టు సంస్థ రైతులకు స్వయం ఉపాధి కల్పిస్తామని, వివిధ ఆగ్రో ప్రోడక్ట్సు, మేలైన మొక్కలు అందజేస్తామని చెప్పి రూ.20 లక్షలు వసూలు చేసిందని ఆరోపిస్తూ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఒక గిరిజన గ్రామాల ప్రజలు ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాణిపేట గ్రామానికి చెందిన మహేంద్రగిరి మల్టిపర్సస్ ఆగ్రో ప్రొడక్ట్ సంస్థ చైర్మన్ ప్రదీప్ కుమార్, తన ప్రతినిధులను గిరిజన గ్రామాల్లో నియమించి వారికి మేలైన పండ్ల మొక్కలు ఇస్తామని అనేక మందికి ఎంజీఎంఏసీలో సభ్యత్వం నమోదు చేశారు. దీనిపై ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారి ప్రశాంత భూపతిని వివరణ కోరగా.. మహేంద్రగిరి మల్టీపర్పస్ ఆగ్రో ప్రొడక్ట్సు సంస్థ రిజిస్టర్డు బాడీ అని, సంస్థ చైర్మన్ ప్రదీప్ కుమార్ గిరిజనులకు మోసం చేయలేదని, సంస్థలో పెట్టుబడి పెట్టే గిరిజన రైతులకు మోసం చేయబోమని, వారి సంస్థ నమ్మకం కలిగించడానికి.. గుమ్మ,కాశీనగర్ సమితుల్లో ఉన్న అనేక రిజన గ్రామాల్లో సభ్యులను సమావేశ పరిచి సందేహాలను నివృత్తి చేస్తామని ఆయన చెప్పాడని ఐఐసీ భూపతి తెలియజేశారు.