
గిరిజనుల ప్రయోజనాలు రక్షించాలి
భువనేశ్వర్: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులతో రాష్ట్రంలో మల్కన్‌గిరి జిల్లా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఈ విపత్తు నివారణ నేపథ్యంలో చొరవ తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర దళిత వ్యవహారాల విభాగం మంత్రి జుయెల్ ఓరాంకు బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు ఈ విషయమై కేంద్ర పర్యావరణ, అటవీ–వాతావరణ మార్పుల మంత్రి బి.యాదవ్‌ను కలిసినట్లు బీజేడీ ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు. మల్కన్‌గిరిలో గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇరువురు మంత్రుల్ని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టును అమలు చేయడంలో సుప్రీం కోర్టు పరిశీలనలను విస్మరించినట్లు మంత్రుల దృష్టికి తీసుకునివెళ్లారు.