
చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి
● సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న
● రాయగడలో ఘనంగా
నందోత్సవాలు
రాయగడ: చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించేలా సామాజిక, సేవా సంస్థలు నడుం బిగించాలని రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న పిలుపునిచ్చారు. స్థానిక లయన్స్ క్లబ్‌లో క్లబ్ ద యంగ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీకృష్ణజన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన నందోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హైందవ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇటువంటి తరహా కార్యక్రమాలను చేపట్టి చిన్నారుల్లో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తున్నందుకు అభినందనీయమన్నారు. చిన్నారులు వారి చదువుల్లో నిమగ్నమవుతూ మన హైందవ సంప్రదాయాలు, సంస్కృతులకు దూరంగా ఉంటున్నారన్నారు. దీంతో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగువుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్లబ్ ది యంగ్ ఇండియా అధ్యక్షులు సురేంద్ర ప్రసాద్ సాహు మాట్లాడుతూ.. ఏటా తమ క్లబ్ ద్వారా నందోత్సవాలను నిర్వహిస్తుండగా.. చిన్నారులు ఆసక్తితో పాల్గొంటున్నారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజల్లో సామాజిక చైతన్యం, సేవా కార్యక్రమాలను క్లబ్ నిర్వహిస్తుందని వివరించారు. రెండు దశాబ్దాలకుపైగా క్లబ్ తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుందని అన్నారు. క్లబ్ సాధారణ కార్యదర్శి దీపక్ కుమార్ పుష్టి క్లబ్ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. 36 మంది చిన్నారులు నందోత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారాణ పోటీల్లొ పాల్గొన్నారన్నారు.
విజేతలు వీరే..
నంోత్సవాల్లొ భాగంగా నిర్వహించిన శ్రీకృష్ట వేషధారణ పోటీల్లో స్వీకృతి ఆచార్య ప్రథమ బహుమతిని గెలుపొందగా దేవాన్షి బక్షీపాత్రో ద్వితీయ, మోక్షిత బెహర తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. పది మందికి ప్రొత్సాహక బహుమతులను నిర్వాహకులు అందజేశారు.

చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి

చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి