
చెరువులో మునిగి తల్లీకూతుళ్ల మృతి
● కుమార్తెను రక్షించడానికి వెళ్లి తల్లి కూడా మృతి
కొరాపుట్: కుమార్తెను రక్షించడానికి వెళ్లి తల్లి కూడా మృతి చెందింది. గురువారం కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లమ్తాపుట్ సమితి కుమార్ గందన పంచాయతీ బలియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బిలాపుట్ గ్రామ పంచాయతీ హర్గండా గ్రామానికి చెందిన నవీనా మజ్జి (40), తన కుమార్లె అంబికా మజ్జి (15)తో కలిసి అల్లం పంట సాగు కోసం వెళ్లారు. నవీనా పొలం పనిలో ఉండగా కుమార్తె అంబికా సమీపంలో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లింది. లోతు తెలియక దిగడంతో అంబికా చెరువులో మునిగిపోతూ కేకలు పెట్టింది. ఇది గమనించిన నవీనా కుమార్తెను రక్షించడానికి వెళ్లి మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నందపూర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
హోటళ్లు, లాడ్జిలు, రెస్టారెంట్లలో తనిఖీలు
జయపురం: జయపురంలోని అన్ని హోటల్లు, లాడ్జీలు, రెస్టారెంట్లపై పోలీసులు బుధవారం అర్ధ రాత్రి వరకు దాడులు నిర్వహించారు. పట్టణంలో మొసగాళ్లు, దుండగులు, డెకాయిట్‌లు పెరగటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టి విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జయపురం పట్టణ పోలీసు, జయపురం సదర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లకు వచ్చే వారి పరిచయపత్రాలు, ఆధార్ కార్డులు పరిశీలించాలని, ఏ వ్యక్తిపైనా అయినా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. కొరాపుట్ జిల్లా ఎస్పీ ఆదేశంతో దాడులు నిర్వహించారు. జయపురం పట్టణ పోలీసు అధికారి, సదర్ పోలీసు అధికారుల నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తాటిచెట్లపాలెం(విశాఖ): వాల్తేరు రైల్వే డివిజన్ టికెట్ తనిఖీ సిబ్బంది మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సిబ్బందిని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర గురువారం సత్కరించారు. మేలో టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రూపాలలో రూ.2,41,20,627 ఆదాయాన్ని ఆర్జించారు. గత సంవత్సరం మేలో సాధించిన రూ. 2,27,34,221 ఆదాయంతో పోలిస్తే, ఈసారి అధిక ఆదాయాన్ని నమోదు చేశారు. ఈ రికార్డు ఆదాయం సాధించడంలో వ్యక్తిగతంగా ఇద్దరు ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. విజయనగరం, టీటీఐ వై. అప్పలరాజు.. 836 కేసులు నమోదు చేసి రూ.4,89,320 జరిమానాలు, అదనపు టికెట్ రుసుముగా వసూలు చేశారు. శ్రీకాకుళం రోడ్డు టీటీఐ కె.శ్రీనివాసరావు 815 కేసులు నమోదు చేసి రూ. 4,42,900 వసూలు చేశారు. వీరిని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ సమక్షంలో సత్కరించారు.
ఇచ్ఛాపురం రూరల్: డొంకూరు సముద్రంలో ఉప్పుటేరు కలిసిన చోట ఇసుక మేటలు వేయడంతో బూర్జపాడు పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయిన విషయం విదితమే. రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘పొగురు తెచ్చిన చేటు’ శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ప్రొక్లెయినర్ సహాయంతో పొగురు తీత పనులు చేయించారు. పంట పొలాల్లో ఉన్న వరద నీరు ఉప్పుటేరు గుండా సముద్రంలో కలవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
గార: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలుర, బాలికలు, ఉపాధ్యాయ యాజమాన్యాలను కళాఉత్సవ్– 2025 పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు వమరవల్లి డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకర్ గురువారం తెలిపారు. 9, 10, 11, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, సంప్ర దాయ కథ చెప్పడం, దృశ్య కళలు వంటి పోటీలను సెప్టెంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, వివరాలకు 7702391639, 9000726375 నంబర్లను సంప్రదించాలని కోరారు.

చెరువులో మునిగి తల్లీకూతుళ్ల మృతి

చెరువులో మునిగి తల్లీకూతుళ్ల మృతి