
తృణధాన్యాలు పండించాలి
జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి
సంజయ్ కుమార్ దోళాయి
పర్లాకిమిడి: జిల్లా స్థాయి వ్యవసాయదారుల ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెట్ లింకేజిపై జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో స్థానిక జిల్లా పరిషత్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్‌లో పంట వైవిధ్యీకరణపై ఒక్కరోజు వర్క్‌షాపును అధికారులు గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ముఖ్య వ్యవసాయశాఖ అధికారి సంజయ్ కుమార్ దోళాయి, జిల్లా ఉద్యానవనాల శాఖ, ఉపసంచాలకులు సుశాంత కుమార్ దాస్, జిల్లాపరిశ్రమల శాఖ పర్యవేక్షకులు సునారాం సింగ్, జిల్లా ప్రాజెక్టుల అధికారి, జీవికా మిషన్ అధికారి టిమోన్ బోరా, సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, ప్రాజెక్టు ఆఫీసర్ కె.సూరజ్‌కుమార్ పాత్రో హాజరయ్యారు. రైతులు, మహిళా స్వయం సహాయక గ్రూపులు కలిసి క్రయ, విక్రయాలు సమన్వయంతో చేస్తే లాభాలు పొందవచ్చని జిల్లా పరిశ్రమలశాఖ అఽధికారి సునారం సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ నినాదంతో తృణ ధాన్యాలు పండించి వ్యవసాయదారులు అధిక లాభాలు పొందాలన్నారు. కేవలం సబ్సిడీల కోసం కాకుండా ధాన్యేతర వాణిజ్యపంటలు, తృణ ధాన్యాలు పండించాలని జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి సంజయ్‌కుమార్ దోళాయి అన్నారు. కార్యక్రమాన్ని గుమ్మ వ్యవసాయ విస్తరణాధికారి నారాయణ చాంద్, సూరజ్ పాత్రో పలువురి రైతులకు, మహిళా గ్రూపులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.