చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి.. | - | Sakshi
Sakshi News home page

చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి..

Aug 22 2025 6:41 AM | Updated on Aug 22 2025 6:41 AM

చదువు

చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి..

చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి లారీ ఢీకొని వృద్ధుడు దుర్మరణం

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఘటన

స్వగ్రామం ఫరీదుపేటలో విషాద ఛాయలు

ఎచ్చెర్ల/వేంపల్లె : వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపుల పాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ సెకెండియర్‌ చదువుతున్న ఎచ్చెర్ల మండలం ఫరీదుపే ట గ్రామానికి చెందిన గురుగుబిల్లి నరసింహనాయుడు (17) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువా రం వేకువజామున వసతి గృహం బాత్‌రూమ్‌లో కిటికీకి నరసింహనాయుడు ఉరి వేసుకుని ఉండటాన్ని తోటి విద్యార్థులు గమనించి సిబ్బందికి సమాచారం అందించగా వేంపల్లి ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. విద్యార్థి మృతితో ఫరీదుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఏం జరిగిందో..

నరసింహనాయుడు తండ్రి అప్పలనాయుడు అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి రాజు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. సోదరి శ్రావ్య కుప్పిలి ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. టెన్త్‌లో 576 మార్కులు రావడంతో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యాడు. అక్కడ వసతి చాలకపోవడంతో ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో వీరికి తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నా డో అర్ధం కావడం లేదని, మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని తల్లి చెబుతోంది. అనంతరం హుటాహుటిన ఇడుపులపాయ బయల్దేరివెళ్లింది.

ట్రిపుల్‌ ఐటీ ఇష్టం లేక..

నరసింహనాయుడుకు చదువులో మంచి పట్టుంది. పీయూసీ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. అయితే ట్రిపుల్‌ ఐటీలో చదవడం ఇష్టం లేనట్లు తెలిసింది. తాను నర్సింగ్‌ చేయాలని అనుకుంటున్నట్లు తోటి విద్యార్థులతో చెప్పేవాడు. చదవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండేవాడని తెలిసింది. విద్యార్థి నాలుగు రోజులుగా ముభావంగా ఉండేవాడని తోటి విద్యార్థులు డైరెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విద్యార్థి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. కాగా, విద్యార్థి మృతి పట్ల విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పలాస: పలాస లేబరుకాలనీలో నివాసముంటున్న శాసనపురి వెంకటరావు(59) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావు బుధవారం ఉదయం శ్రీకాకుళంలోని తన కుమార్తె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ల కోసం వెళ్లాడు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో స్వగ్రామం గొప్పిలి వెళ్లడానికి బెండిగేటు నుంచి టెక్కలిపట్నం వెళ్తుండగా మోదుగులపుట్టి వద్ద బైక్‌ అదుపు తప్పింది. తలకు బలమైన గాయాలు కావడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో 108లో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాశీబుగ్గ ఏఎస్‌ఐ ప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రణస్థలం: లావేరు మండలం బుడుమూరు కూడలి సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నడుస్తున్న బొడ్డ గోవిందరాజులు (66)ను శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వగ్రామం విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం బక్కన్నపాలెం. బుడుమూరులోని కుమార్తె ఇంటికి పది రోజుల కిందట వచ్చాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లి రోడ్డు పక్కన నడుస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఏఎస్సై ప్రసాదరావు కేసు నమోదు చేశారు.

క్రైమ్‌

కార్నర్‌

చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి..1
1/2

చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి..

చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి..2
2/2

చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement