
సిద్ధేశ్వర మిశ్రా, కన్హుచరణ్ భుయ్యాన్ సస్పెండ్
పర్లాకిమిడి: బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు సిద్ధేశ్వర మిశ్రా (డుల్లు), కుజాసింగి మాజీ సర్పంచ్ కున్హు చరణ్ భుయ్యాన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మేరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో విలేకరుల సమావేశంలో గురువారం ప్రకటించారు. స్థానిక పీడబ్ల్యూడీ డాక్ బంగళాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నబకిశోర్ శోబోరో, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు తదితరులు మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీలో ఉండి ఇతర పార్టీకి పనిచేయడం, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిపై ఆక్రమణ, అనేక యువ మోర్చాలను ఏర్పాటుచేసి సమాంతర పార్టీ కార్యకలాపాలు చేస్తున్నందుకు మండలాధ్యక్షుల ఫిర్యాదు మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి పంపామన్నారు. పార్టీ నాయకులు ప్రసన్నకుమార్ నాయక్, కోడూరు జీవన్, తదతరులు పాల్గొన్నారు.