
పూర్వ విద్యార్థుల రక్తదానం
పర్లాకిమిడి: రక్తదానం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడిన వారమౌతామని వక్తలు అన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని నవోదయ విద్యాలయం పూర్వపు విద్యార్థుల (జాగో) సంఘం అధ్యక్షులు నూకల వెంకటేష్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు వద్ద ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 60 మంది రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి డాక్టర్ సంతును పాఢి హాజరయ్యారు. మొత్తం 17 యూనిట్ల రక్తం సేకరించి బ్లడ్ బ్యాంకు అందజేశారు. సీనియర్ ఫార్మసిస్టు జుధిస్టర బెహారా, ఇతర సిబ్బంది సహకారం అందించగా.. జాగో ఉపాధ్యక్షులు మనోజ్ పట్నాయక్, అభిరాం మండళ్, సాయిరాం పట్నాయక్ పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల రక్తదానం