హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

Aug 15 2025 6:32 AM | Updated on Aug 15 2025 6:32 AM

హర్‌

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

పర్లాకిమిడి: గజపతి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయం నుంచి జాతీయ పతాకాలతో మోటారు సైకిళ్ల ర్యాలీని జిల్లా కలెక్టర్‌ మధుమిత జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా అంతటా ఏడు రోజులు తిరంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ అన్నారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి గజపతి స్టేడియం, హైస్కూల్‌ జంక్షన్‌, మార్కెట్‌, కొత్త బస్టాండ్‌, ప్యాలస్‌ వీధి మీదుగా ప్రభుత్వ ఆస్పత్రి మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో అధికారులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఏడీఎం ఫల్గుణీ మఝి, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా, డీఎఫ్‌ఓ కె.నాగరాజు, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్‌ మహాపాత్రో, జిల్లా పరిషత్‌ అదనపు పీడీ ఫృథ్వీరాజ్‌ మండల్‌, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో..

పర్లాకిమిడి: భారతీయ జనతా పార్టీ స్థానిక ఇరదల వీధి పార్టీ కార్యాలయం నుంచి రాజవీధి మీదుగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తిరంగ శోభాయాత్ర ర్యాలీని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోరో శోబోరో, మాజీ అధ్యక్షుడు ముల్లి గోపాలరావు, సిద్ధేశ్వర మిశ్రా, కాశీనగర్‌ నాయకులు ఛిత్రి సింహాద్రి, యువజన నాయకులు కోట్ల యువరాజ్‌, కౌన్సిలరు బబునా బెహారా పాల్గొన్నారు.

రాయడలో..

రాయగడ: జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారుల ఆధ్వర్యంలో గురువారం వివిధ పాఠశాలల విద్యర్థులు ర్యాలీ నిర్వహించారు. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. స్థానిక రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల్లో చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి, జిల్లా అదనపు కలెక్టర్‌ నిహరి రంజన్‌ కుహోరో, జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్‌ ఆలీనూర్‌, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి సుస్మీతా బౌరి, తదితరులు పాల్గొన్నారు.

మల్కన్‌గిరిలో..

మల్కన్‌గిరి: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ సోమేశ్‌ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ నుంచి సాంస్కృతిక భవనం వరకు 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సంగ్‌ మడ్కామి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సమారీ టాంగులు, జిల్లా అదనపు కలెక్టర్‌ వేద్బర్‌, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్‌ చంద్ర సోభరో , జిల్లా సబ్‌ కలెక్టర్‌ అశ్ని, ఇతర అధికారులు పాల్గొన్నారు.

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ 1
1/3

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ 2
2/3

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ 3
3/3

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement