TDP NRIs Fitting At TANA Meeting in USA - Sakshi
Sakshi News home page

TANA Meeting:  తానా సభల్లో తన్నుకున్న లోకేశ్, జూ.ఎన్టీఆర్‌ వర్గాలు

Published Sun, Jul 9 2023 1:49 PM

TDP NRIs Fitting Goes Viral At Tana Meeting USA - Sakshi

పెన్సిల్వేనియా, అమెరికా : అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్, లోకేశ్‌ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్‌ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం లోకేష్‌ నాయకత్వంపై వ్యక్తమైన విమర్శలే కారణమని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా కొందరు తెలుగు తమ్ముళ్లు ‘జై ఎన్టీఆర్‌’అని నినదించడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు వర్గం దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంతవరకు టీడీపీకి మనుగడ లేదని, 2024లోనూ మరోసారి పరాజయం ఖాయమని కొందరు ఎన్నారైలు వాదించినట్లు సమాచారం. తనను తాను మూర్ఖుడిగా చెప్పుకునే లోకేష్ కు బదులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఓ వర్గం డిమాండ్‌ చేసింది. దీంతో కలవరం చెందిన చంద్రబాబు వర్గం దాడులకు దిగినట్లు తెలిసింది. అమెరికాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన తానాకు ఈ ఘటన మాయని మచ్చలా మిగిలింది.  

ఘనంగా ప్రారంభం.. అంతలోనే వివాదం

పెన్సిల్వేనియాలో తానా 23వ మహాసభలను ఘనంగా ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రిటైర్డ్‌ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బాంకెట్‌ డిన్నర్‌ ముగిసిన అనంతరం తానాలోని కొందరు ప్రముఖులు కన్వెన్షన్‌ సమీపంలోని హాలులో కలుసుకున్నారు.

కర్రలు విసురుకుంటూ.. 

సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న తానాకు ఫిలడెల్ఫియాలో జరిగిన అనూహ్య ఘటన ఊహించని ఇబ్బంది తెచ్చింది. తొలి రోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత తానాలోని కొందరు ముఖ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవకు దిగారు. కొందరు తానా ముఖ్యులు ఆపడానికి ప్రయత్నించినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరికి స్థానిక సెక్యూరిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. 

ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన అంశాలపై తరని పరుచూరి, సతీష్‌ వేమన వర్గాల మధ్య వివాదం రేగడంతో ముష్టి యుద్ధానికి దిగాయి. వివాదం శృతి మించడంతో కొందరు అందుబాటులో ఉన్న కర్రలను విసిరారు. ప్రతిష్టాత్మక తానా సంస్థను రాజకీయ సంస్థగా మార్చిన ఘనత చంద్రబాబుదేననే విమర్శలున్నాయి. నిధుల సేకరణ కోసం తానాను ఆయన కామధేనువులా మార్చుకున్నారు.   

గొడవకు కారణం లోకేష్ సమర్థతేనా?

తానాకు హాజరయిన కొందరు సభ్యుల్లో గొడవ ముదరడానికి ప్రధాన కారణం తెలుగుదేశం రాజకీయాలే అని తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం చంద్రబాబు, లోకేషేనని.. మళ్లీ 2024 ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం తప్పదని కొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంత కాలం బాగుపడే అవకాశం లేదని చెప్పుకున్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారని, అయితే తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకుంటోన్న లోకేష్ కు అంత సీన్ లేదని, లోకేష్ బదులు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే గానీ పార్టీ బాగుపడదని కొందరు వాదించినట్టు తెలిసింది. ఇటీవల చంద్రబాబు ఎక్కడికెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, పార్టీ పగ్గాలు జూనియర్ కు ఇస్తేనే.. బాగుంటుందని ఎక్కువ మంది వాదించారు. దీంతో చంద్రబాబు వర్గంలో కలవరం మొదలై, దాడులకు దిగే దుస్థితి వచ్చినట్టు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది.

చదవండి:  మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్‌ ఫుల్‌ ఫైర్‌

ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?

అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్‌ వర్సెస్‌ పవన్‌ ఫ్యాన్స్‌..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement