మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్‌ ఫుల్‌ ఫైర్‌

Bandla Ganesh Serious Comments On TANA TDP NRIs Fighting - Sakshi

అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం Telugu Association of North america (TANA, తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు  పిడి గుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక, ఈ ఘటనపై టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌ స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ లీడర్లపై ఫుల్‌ సీరియస్‌ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన బండ్ల గణేష్‌.. ‘తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి:  US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?

తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు

అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్‌ వర్సెస్‌ పవన్‌ ఫ్యాన్స్‌.. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top