America: Telugu NRI Falling in Political, Caste and Regional Controversies - Sakshi
Sakshi News home page

US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?

Published Sun, Jul 9 2023 3:43 PM

America : Telugu NRIs are falling in political, caste and regional controversies - Sakshi

ఒకప్పుడు అమెరికాకు వచ్చే ప్రవాసాంధ్రులంటే ఎంతో గౌరవం. అక్కడి సమాజం హర్షించేలా హుందాగా ఉండేవారు. తెలివితేటల్లో మిన్నగా ఉంటూ ప్రతిభను చాటేవారు. అమెరికాలోని ఏ నగరానికి వెళ్లినా .. తెలుగు వాళ్లంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి తరచుగా దిగజారుతోంది. చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెల్లువెత్తుతోన్న  ప్రవాసాంధ్రుల్లో.. చాలా మంది కొన్నాళ్ల పాటు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. 

ఎందుకీ జాడ్యం

 • తొలుత వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగాలకు పరిమితమయిన ప్రవాసాంధ్రులు.. ఇప్పుడు కంపెనీలు నెలకొల్పారు, విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో పేరాశ వీపరీతంగా పెరిగింది. 
 • డబ్బు సంపాదనతో ఆగిపోకుండా.. దాన్ని ఎగ్జిబిట్.. అంటే ప్రదర్శనకు తహతహలాడుతున్నారు. అమెరికన్ల తరహాలో హుందాగా వీక్ డేస్ లో కనిపించే ప్రవాసాంధ్రులు.. వీకెండ్ లో పార్టీ కల్చర్ వీపరీతంగా పెంచుకుని.. అక్కడ తమ స్థాయి, దర్పాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లుతున్నారు.
 • కనీసం కేజీ బంగారం శరీరంపై వేసుకుంటే తప్ప కన్వెన్షన్ కు హాజరు కాలేని పరిస్థితి చాలా మంది తెలుగు కుటుంబాల్లో ఉంది. 
 • ఆరంభంలో తమ కెరియర్ పై దృష్టి పెట్టిన చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వైపు తొంగి చూస్తున్నారు.

టిడిపి ఎంట్రీతో మారిన సీన్

 • అక్కడ బాగా సంపాదించిన వారు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం పరిపాటి అయింది. దీన్నే అక్కడ హెలికాప్టర్ క్యాండిడేట్స్ అని సరదాగా చెప్పుకుంటారు. ఇలాంటి అభ్యర్థులంటే తెలుగుదేశం పార్టీకి పండగే. టికెట్ల కోసం ఎంతయినా ఖర్చు పెట్టడం, ఓటుకు కోట్లు గుప్పించడం ఇలాంటి వారి వల్ల చాలా సులభమని చంద్రబాబు నమ్ముతారు. 
 • చాలా మంది ప్రవాసాంధ్రులు వ్యాపారాల వైపు మళ్లారు. అయితే వీరేమి గొప్ప వ్యాపారాలు చేయడం లేదు. పేరాశ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్, హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ తో పాటు టెక్సాస్ లాంటి చాలా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అంతా మన వాళ్ల చేతిలోనే ఉంది.
 • తనకు అనుకూలమైన కొందరిని విదేశాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంచడం చంద్రబాబుకు బాగా అబ్బిన కళ. అక్కడి నుంచి రకరకాల ఫేక్ స్టోరీలను వండి తెలుగు రాజకీయాలపై వదలడం బాబు కోటరీకి వెన్నతో పెట్టిన విద్య. పేరులో కులాలను మార్చి.. ప్రత్యర్థులపై దాడి చేయడం బాగా అలవాటుగా మారింది. ఇందులో కొందరు ఎన్నారైలు పావులైపోతున్నారు. 

డబ్బు కోసం విలువలు మరిచి.. 

 • ఇదే సమయంలో మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో ఇండియా నుంచి ప్రముఖ అమ్మాయిలను తెప్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'గంటకు ఇంత అంటూ' అనైతిక కార్యక్రమాలకు దిగి అక్కడి పోలీసులకు దొరికిపోయి మొత్తం తెలుగు ప్రజలకే చెడ్డ పేరు తెస్తున్నారు. 
 • షికాగో వేదికగా ఐదారేళ్ల కింద కొందరు పట్టుబడడం వల్ల చాలా మంది తెలుగు వాళ్లు ఇబ్బంది పడ్డారు. అసలు మాది తెలుగు అని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డారు. 
 • వీసా ఇంటర్వ్యూలకు సినీ తారలు వెళ్తే అనుమానించే పరిస్థితి ఎదురయిందని కొందరు ప్రవాసాంధ్రులు తెలిపారు

గ్రూపులు.. వర్గాలు

 • ఇక ఏ ఈవెంట్ జరిగినా.. రెండుగా చీలడం పరిపాటయింది. ఇటీవల టెక్సాస్ లో బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బాహటంగానే తన్నుకున్న విషయం ప్రవాసాంధ్రుల మదిలోంచి ఇంకా పోలేదు.
 • ఒక్క తెలుగుదేశంలోనే చాలా వర్గాలున్నాయి. అమెరికాకు 40, 50 ఏళ్ల కిందనే రావడంతో టిడిపి ఎన్నారైలలో ప్రాంతీయ అభిమానం బాగా పెరిగిపోయింది
 • కులాల పేరుతో సంఘాలు, సినీ నటుల పేర్లతో అభిమాన సంఘాలు బాగా పెరిగిపోయాయి. 
 • ఇక ప్రాంతాల వారీగా ఇది మరింత ముదిరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్తా.. జిల్లాల పేరుతో మీటింగ్ లు, భేటీలు జరుగుతున్నాయి. 

ఒకప్పుడు ఘన చరిత్ర ఉన్న ప్రవాసాంధ్రులు కాస్తా.. ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం కాస్తా ఇబ్బందికరమేనని వాపోతున్నారు. 

చదవండి: తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు

మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్‌ ఫుల్‌ ఫైర్‌

అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్‌ వర్సెస్‌ పవన్‌ ఫ్యాన్స్‌..

Advertisement
 
Advertisement