అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్‌ | A Man Arrested For Murder Of Indian Man Dasari Gopikrishna In US | Sakshi
Sakshi News home page

అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్‌

Published Tue, Jun 25 2024 11:03 AM | Last Updated on Tue, Jun 25 2024 11:22 AM

A Man Arrested For Murder Of Indian Man Dasari Gopikrishna In US

అమెరికాలోని డల్లాస్‌లో భారతీయ యువకుడిని కాల్చి చంపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  స్థానిక దుకాంలో చోరీకి పాల్పడి, దాసరి గోపీకృష్ణను కాల్చి చంపిన కేసులో మాథిస్‌పై అభియోగాలు నమోదు చేశారు.  ఇతనిపై  ఇంతకుముందు కూడా  హత్యా నేరం అభియోగాలున్నాయని పోలీసులు వెల్లడించారు.

జూన్‌ 21న, గోపీకృష్ణ పనిచేస్తున్న స్థానిక కన్వీనియన్స్ స్టోర్‌లో దుకాణంలో చోరీకి తెగబడిన మాథిస్ కౌంటర్ వద్ద ఉన్న గోపీకృష్ణపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, స్నేహితులు కాన్సులేట్‌ సహకారంతో గోపీకృష్ణ మృతదేహాన్ని బాపట్లలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ  ఎనిమిది నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు.   గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement