విదేశాల్లోనూ ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు | HBDYSJAGAN Jagans birthday celebrated abroad grandly | Sakshi
Sakshi News home page

విదేశాల్లోనూ ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

Dec 23 2024 9:57 AM | Updated on Dec 23 2024 12:36 PM

HBDYSJAGAN Jagans birthday celebrated abroad grandly

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మా­జీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మది­న వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తది­తర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్‌ జగన్‌ పుట్టిన­రో­జు సందర్భంగా భారీఎత్తున కేక్‌లు కట్‌చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలా­గే.. బ్రిటన్‌లోనూ అంగరంగ వైభవంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. 

లండన్‌ ఈస్ట్‌ హాంలో వైఎస్సార్‌సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్‌చింతా ప్రదీప్, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్‌ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్‌ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకు­న్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్‌ మాట్లాడు­తూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్‌ జగన్‌ అని చెప్పడంతో జై జగన్‌ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ­య్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్‌ విమలారెడ్డి తనయుడు యువరాజ్‌రెడ్డి ఆన్‌లైన్‌లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. 

ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డి
అనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అను­బంధ విభాగాల ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. జగన్‌ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్‌ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.

సింగపూర్‌లోనూ సంబరాలు..
వైఎస్‌ జగన్‌ జన్మది­న వేడుకలు సింగపూర్‌లో కూడా ఆదివారం ఎన్నా­రైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్‌ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్‌ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్‌ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్‌ను కొనియాడారు.

మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి! 

దుబాయ్‌లో అత్యంత వైభవంగా..
ఇక యునెటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్‌సీపీ ఎ­న్నాౖ­రె కమిటీ సలహాదారు ప్రసన్న సోమి­రెడ్డి, వైఎస్సార్‌­సీపీ యూఏఈ కో–కన్వీనర్‌ మైనర్‌ బాబు, తది­తరు­ల ఆధ్వర్యంలో దుబాయ్‌లోని హోటల్‌ విస్తా­లో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభి­మానులు భారీ­ఎ­త్తు­న పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నా­గేశ్వ­రావు తదితర వక్తలు జగన్‌ పాలనలో జరి­గిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు­చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైని­కుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్‌­సీపీని అఖండ మెజార్టీతో గెలిపించు­కుని.. వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చేద్దా­మని పిలుపి­చ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్‌), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement