Photo Credit: Twitter
2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించిన మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌లో లగ్జరీ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అతడి భార్య దేవీషా శెట్టితో కలిసి సూర్యకుమార్ ఒక వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. కాగా దుబాయ్‌లో మారిటైమ్ సిటీలో డ్యాన్యూబ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన విలాసవంతమైన ప్రాపర్టీని సూర్య దంపతులు కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీ బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన షారుక్ రెసిడెన్సీస్కు అతి సమీపంలో ఉండడం విశేషం.
"నేను మొదట 2014లో ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్‌కి వచ్చాను. ఆ తర్వాత 2020లోనూ మరోసారి దుబాయ్‌కు వచ్చాను. ఇప్పుడు యావత్ భారతదేశం దుబాయ్‌కి వస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడి విలాసం, జీవన నాణ్యత భిన్నంగా ఉంటాయి. నేను నివసించే ముంబైలో భద్రత బాగున్నప్పటికీ, దుబాయ్‌లో భద్రత మరింత బాగుందనిపిస్తోంది.
ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తోంది. దుబాయ్ వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటాను. 40కి పైగా ప్రీమియం సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక నన్ను పూర్తిగా ఆకట్టుకుంది మాత్రం లాంజెవిటీ లాంజ్. నివాస ప్రాజెక్టులలో ఇలాంటిది వినడమే అరుదు'' అని పేర్కొన్నాడు. సూర్యకుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే అతడు తన మకాంను భారత్ నుంచి దుబాయ్‌కు మార్చనున్నట్లు తెలుస్తోంది.
కాగా సూర్యకుమార్ భార్య దేవిషా ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రూ. 7.18 కోట్లకు ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. 1,516.20 చదరపు అడుగుల (140.86 చదరపు మీటర్ల) విస్తీర్ణం గల ఈ ఆస్తి గోద్రెజ్ స్కై టెర్రసెస్లో ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఆ భవనంలో ఈ జంట కొనుగోలు చేసిన మూడవ అపార్ట్మెంట్ ఇది.
2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నాయకుడిగా జట్టును విజయపథంలో నడిపించాడు. కానీ ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. టీ20 కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, సూర్య స్థానంలో శ్రేయస్‌ను కెప్టెన్‌గా నియమించడం జరిగింది.
ఇదీ చదవండి:


