Photo Credit: Twitter
ఉప్పల్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన నాలుగో టీ20లో అభిషేక్ శర్మ, విండీస్ బౌలర్ కీమో పాల్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా సైగలతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డ విండీస్ బౌలర్‌కు అభిషేక్ మాస్ వార్నింగ్ ఇవ్వడం వైరల్‌గా మారింది.
కరచాలనం చేసుకునే సమయంలో కీమో పాల్ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అభిషేక్.. ఇది మంచి పద్దతి కాదంటూ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోవడం కెమెరా కంటికి చిక్కింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు, అంపైర్ వారిని విడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
మ్యాచ్ సమయంలో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కీమో పాల్.. వికెట్ తీసిన ప్రతీసారి కాస్త అగ్రెసివ్‌గా ప్రవర్తించాడు. తన వెలికి చేష్టలతో టీమిండియా బ్యాటర్లకు సైగలు చేశాడు. అయితే అభిషేక్ శర్మ ఔటైన సమయంలోనూ కీమో పాల్ వెటకారంగా సైగలు చేశాడు. అతడి చర్యలతో సుర్రుమన్న అభిషేక్.. కీమో పాల్‌తో మాటల యుద్ధానికి దిగాడు.
అయితే అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని అభిషేక్‌ను పంపించారు. అయితే కీమో పాల్ ప్రవర్తనను రుచించని అభిషేక్ శర్మ మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో కీమో పాల్ వద్దకు రాగానే.. ఇలాంటి పనులు చేయొద్దని, హుందాగా ప్రవరిస్తే బాగుంటుందని పాల్‌కు మాస్ వార్నింగ్ ఇవ్వడం కనిపించింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. షై హోప్ (50 బంతుల్లో 102 నాటౌట్) అజేయ సెంచరీ సాధించగా, రూథర్‌ఫోర్డ్ (49 నాటౌట్) మెరిశాడు. అనంతరం భారత్ 19.3 ఓవర్లలో (223-9) పరుగులకు ఆలౌటైంది( అర్షదీప్ సింగ్ రిటైర్డ్ హర్ట్).
ఓపెనర్ సంజూ సామ్సన్ (56), తిలక్ వర్మ (43), నితీశ్‌రెడ్డి (41) మినహా మిగతావాళ్లు విఫలమయ్యారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఇరుజట్లు 2-2తో సమంగా ఉన్నాయి. రేపు బెంగళూరు వేదికగా భారత్, వెస్టిండీస్‌లు చివరి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.
Abhishek Sharma was not happy with the send off by Keema Paul during the 3rd T20i #indvwi https://t.co/TYTMQYjjv8
— Nibraz Ramzan (@nibraz88cricket) October 15, 2026
ఇదీ చదవండి:


