షార్లెట్‌లో ఘనంగా ‘తెలుగు సంబరాలు’ | NATS Telugu Sambaralu 2026 In Charlotte | Sakshi
Sakshi News home page

షార్లెట్‌లో ఘనంగా ‘తెలుగు సంబరాలు’

Oct 17 2026 6:02 PM | Updated on Oct 17 2026 6:13 PM

NATS Telugu Sambaralu 2026 In Charlotte

అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, ఫ్రీస్టైల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సైన్స్ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో తొమ్మిది శాస్త్రీయ అంశాలను ప్రయోగాలు, డెమోన్స్ట్రేషన్ల ద్వారా చిన్నారులకు పరిచయం చేశారు. డ్రై ఐస్ ప్రయోగాలు, ప్లాస్మా బాల్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

తానా, జీటీఏ, ఆప్టా తదితర తెలుగు సంస్థలు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యాయి. నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 800 కొత్త రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, సంస్థల ప్రతినిధులు, ప్రేక్షకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలుగు సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాల విస్తరణ, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) మిషిగన్ చాప్టర్‌ను ఫార్మింగ్టన్ హిల్స్‌లో ప్రారంభించారు. చాప్టర్ కోఆర్డినేటర్‌గా శ్రీదేవి మణేపల్లి, జాయింట్ కోఆర్డినేటర్‌గా మహి బొల్లవరం నియమితులయ్యారు. రవి చాలంటి ఈవెంట్స్, లాజిస్టిక్స్ బాధ్యతలు, హేమ సూరపరాజు ట్రెజరర్‌గా, జ్యోతి జవ్వాది సభ్యత్వ బాధ్యతలు, అనుపమ దివాకర్ల పబ్లిక్ రిలేషన్స్, మీడియా బాధ్యతలు చేపట్టనున్నారు.

నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల సంస్థ హెల్ప్‌లైన్ సేవలను, అవసరంలో ఉన్న తెలుగు వారికి అందిస్తున్న సహాయాన్ని వివరించారు. అధ్యక్షుడు రాజ్ అల్లాడా సమాజ సేవకు నాట్స్ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా మనోరమ గాంధీ, కూచిపూడి కళా ప్రోత్సాహకురాలు సంధ్య శ్రీ ఆత్మకూరి, తెలుగు భాషా కార్యక్రమం మనబడి, సామాజిక సేవకుడు సన్నీ రెడ్డి, వైద్య, సినీ రంగాల్లో సేవలందిస్తున్న డాక్టర్ హరినాథ్ పోలిచెర్లను సత్కరించారు. స్థానిక విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆప్టా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్, డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యం, సాధికారత, యువ నాయకత్వం, క్రీడలు, కుటుంబ కార్యక్రమాలు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ లక్ష్యంగా ప్రతి మూడు నెలలకు కనీసం ఒక ప్రధాన సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని మిషిగన్ చాప్టర్ నిర్ణయించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement