అబుదాబిలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు | Abu Dhabi: Telangana Friends Association Bathukamma Celebrations | Sakshi
Sakshi News home page

TFA: అబుదాబిలో అంబరాన్నంటిన‌ బతుకమ్మ సంబరాలు

Oct 17 2026 1:50 PM | Updated on Oct 17 2026 2:20 PM

Abu Dhabi: Telangana Friends Association Bathukamma Celebrations

తెలంగాణ పల్లెలు అన్నీ అబుదాబికి కదలి వచ్చినయా! అన్నట్టుగా అనుభూతి కలిగేలా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్(టీఎఫ్ఏ) అబుదాబి వారు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అబుదాబి వేదికగా జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కౌన్సలర్ ఆఫ్ ఎంబసీ ఇండియా సౌమ్య గుప్తా, గౌరవ అతిథిగా కౌన్సలర్ ఆఫ్ ఇండియా ఎంబసీ డాక్టర్ బాలాజీ రామస్వామి, ప్రత్యేక అతిథిగా బీజేపీ తెలంగాణ ఎన్నారై కన్వీనర్ దాస్యం అభినవ్, ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు బిజి  థామస్, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారై సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళలు బతుకమ్మలను తయారు చేసి తీసుకువచ్చారు. సంప్రదాయ నృత్యాలతో 4 గంటల పాటు కొనసాగిన ఈ ఉత్సవాలలో మహిళలు, యువతులు, చిన్నారులు ప్రత్యేక నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించారు. ఇండియా నుండి వచ్చిన ప్రముఖ కళాకారుడు డాక్టర్ కోకిల నాగరాజు నృత్య దర్శకత్వంలో రూపొందించిన ఈ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇండియా నుండి వచ్చిన గాయకులు, డాన్సర్లు అంజలి పులింటి, సోనీ యాదర్ల, సోనీ పటేల్‌లు తమ ఆటపాటలతో అలరించారు.

అబుదాబిలో నివసించే కవీష్, సంజన, అభిరామ్‌లు చక్కటి బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు. రాము గౌడ్ కుటుంబ సభ్యులు రూపొందించిన 12 అడుగుల బతుకమ్మ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది. సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలు తయారుచేసి తీసుకొచ్చిన మహిళలకు, సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు నిర్వాహకులు అందించారు.

తెలంగాణ సంప్రదాయాన్ని, సంస్కృతిని పరిరక్షించడం కోసమే గత 10 సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవంతో పాటు వివిధ పండుగలకు అందరినీ ఏకం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు TFA అధికార ప్రతినిధి రాజా శ్రీనివాసరావు తెలిపారు. 

బ‌తుక‌మ్మ వేడుక‌ల కోసం శ్ర‌మించిన TFA మ‌హిళా స‌భ్యులు పావని, అర్చన, పద్మజ, నిధి, వాహిని, ప్రణతి లను సౌమ్య గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. వేల సంఖ్యలో ప్రజలు హాజరైన ఈ సంబరాల్లో యూఏఈ దేశ మహిళలు సైతం పాల్గొని ఆడి పాడడం విశేషంగా ఆకట్టుకుంది. TFA ప్రతినిధులు శ్రీనివాస్, గంగారెడ్డి, వంశీ, అశోక్, జగదీశ్, గోపినాథ్ తదితరులు వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌లో పాలుపంచుకున్నారు. 

ఇదీ చ‌ద‌వండి: అడిలైడ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement