సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్, ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సోమవారం అడిలైడ్‌లోని క్యాంప్‌బెల్‌టౌన్ సిటీ ఫంక్షన్ సెంటర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిలైడ్‌లోని తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో కొలిచి, పూజలు చేశారు.
అనంతరం తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ కమిటీ సభ్యులు వంశీ బొంతు, ప్రసన్న కుమార్ రెడ్డి అట్లూరి, రామ్ మునగాల, ఉదయ్ కుందం, కిషోర్ అనుమోలు, విజయ్ వంగా, నవీన్ గుర్రాల, ప్రవీణ్ మునగాల, భాను పుట్టా, భాస్కర్ రెడ్డి సమన్వయంతో వేడుకలు విజయవంతంగా జరిగాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న తెలుగు సమాజ సభ్యులందరికీ ఫౌండేషన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చదవండి: దుబాయ్‌లో ఘనంగా 16వ బతుకమ్మ సంబరాలు


