బోధన్: రియాద్ జైలులో ఉన్న తన భర్తను విడిపించి, స్వదేశానికి రప్పించాలని బాధిత భార్య సీఎం ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించింది. వివరాలు ఇలా.. సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య–రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ (32) 2023లో ఉపాధి నిమిత్తం సౌదీ ఆరేబియా దేశంలో రియాద్‌కు వెళ్లాడు. అక్కడ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తుండగా 2024 మే 6న జరిగిన రోడ్డుప్రమాదంలో స్థానిక దంపతుల మృతికి కారణమయ్యాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు శ్రావణ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కోర్టులో విచారణ అనంతరం రూ.3.30 లక్షల రియాళ్లు (బ్లడ్ మనీ),భారతీయ కరెన్సీలో రూ.84 లక్షలు పరిహారం బాధిత కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు చెల్లిస్తే జైలు నుంచి విముక్తి అయ్యే అవకాశం కలుగుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణకు అంతమొత్తంలో చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో శ్రావణ్ భార్య మమత ఈ ఏడాది మే 29న హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణికి వెళ్లి తన భర్తను జైలు నుంచి విడిపించాలని అభ్యర్థించింది. అప్పటి నుంచి ప్రజావాణి చుట్టూ తిరుగుతుంది. తాగా శుక్రవారం మళ్లీ ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించి, విరాళాల సేకరణకు సౌదీ కోర్టు నుంచి అనుమతి ఇప్పించాలని, క్రౌడ్ ఫండింగ్ కోసం సహకరించాలని సీఎం ప్రవాసీ ప్రజావాణి ఓఎస్డీ రాకేశ్‌రెడ్డి, ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిలను కలిసి అభ్యర్థించింది. ప్రజావాణి వలంటీర్లు కర్రి పద్మారాణి, గంగుల మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రియాద్ రోడ్డు ప్రమాద ఘటనలో జైలుకు వెళ్లిన కుమ్మన్‌పల్లి వాసి
బ్లడ్ మనీ కింది రూ.84 లక్షలు
పరిహారం చెల్లించాలన్న అక్కడి కోర్టు
క్రౌడ్ ఫండింగ్ కోసం సీఎం ప్రవాసీ ప్రజావాణిలో బాధితుడి భార్య వినతి


