● సీపీ సాయిచైతన్య
బోధన్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు వేడుకలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడాకారులకు వసతి సౌకర్యం క ల్పించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు ఇత ర మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, బోధన్, రుద్రూర్ సీఐలు విజయ్‌బాబు, కృష్ణ, బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణ, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తదితరులు ఉన్నారు.


