● వీసీలో సీఎస్ సంజయ్ జాజు
● తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
తీసుకోవాలి
● ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి జరపాలి
నిజామాబాద్ అర్బన్: ఎల్ నినో నేపథ్యంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వివిధ శాఖ ల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక అంశాలపై సమీక్ష జరిపారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా ప్రత్యేక కార్యాచరణతో తగు చర్యలు చేపట్టాలన్నా రు. చేతిపంపుల మరమ్మతులు, పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టడం వంటి పనులను చేయించాలన్నారు. ప్ర స్తుతం జలాశయాలలో ఉన్న నీటి నిల్వలను పూ ర్తిగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. సింగూర్ రిజర్వాయర్లో సరిపడా నీటి నిల్వలు లేనందున నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు వీలుగా రూ.120 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన లబ్ధిదారులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు దీపావళి వేడుకల్లో పాల్గొనాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు, రైల్వే లైన్ల విస్తరణ, ఇతర అవసరాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు. అకోలా –డోన్ సెక్షన్‌లో రైల్వే డబ్లింగ్ పనులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేశామని సీఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో సిద్ధాపూర్, మంచిప్ప రిజర్వాయ ర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేశామని, అవార్డు పాసైన రైతులకు సత్వరమే డబ్బులు చెల్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున తాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణతో ముందుకెళ్తున్నా మని అన్నా రు. రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీసీ లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ నవ్యశ్రీ, డీఆర్వో గీత, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయ కుమారి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, అధికారులు పాల్గొన్నారు.


