నవీపేట : గోదావరి పరీవాహక ప్రాంతంలో బోరు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ డీఈఈ బలరాం, ఏఈ ప్రణయ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదిలోని నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికా రులు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పంటల సాగుకు మోటార్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని, పరీవాహక ప్రాంత ప్రజలు సహకరించాలని కోరారు.
కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ
సుభాష్‌నగర్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూ ర్యనారాయణ కలెక్టర్ ఇలా త్రిపాఠితో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా కొనసాగుతున్న పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్ర ధానంగా ఆర్‌అండ్‌బీ, పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర ఉన్నతాధికారులతో ఆయా పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వా డీ కేంద్రాలకు శాశ్వత భవనాలు, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రోడ్డు పను లు, కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు స్థలసేకరణ తదితర అంశాలపై చర్చించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన మారుతి
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన పర్వతారోహకుడు ఆర్మూర్ మారుతి శుక్రవారం అత్యున్నత ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను అధిరోహించాడు. అక్టోబర్ 26న పర్వతారోహణకు వెళ్లిన మారుతి శుక్రవా రం గమ్యాన్ని చేరుకున్నారు. భూ ఉపరితలానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై త్రివర్ణ పతాకంతో అభి వాదం చేశాడు. మారుతి 2023 ఆగస్టు 15న ఆఫ్రికా ఖండంలోని అత్యున్నత శిఖరం కిలిమంజారో (5895 మీ.), 2024 ఆగస్టు 17న యూరప్‌లోని ఎలబరస్ (5652 మీ) పర్వతాలను అధిరోహించాడు. ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను మారుతి అధిరోహించడంపై నాళేశ్వర్ గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.
ముగిసిన శిక్షణ
నిజామాబాద్ అర్బన్: మూడు రోజులుగా జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 350 మంది అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో డిజిటల్, ఆర్థిక పరిపాలన వ్యవస్థ సమర్థవంతంగా అమలు చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఖజానా శాఖ అధికారులు సంధ్యరాణి, రాధ, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


